కరెంట్‌ అఫైర్స్‌

భారత్‌లో క్షయ (టీబీ) వ్యాధి బారిన పడేవారి సంఖ్యను 2020కు ప్రతి లక్ష మందిలో 171 మందికి పరిమితం చేయాలనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యం కాగా

Published : 31 May 2024 00:42 IST

మాదిరి ప్రశ్నలు

  • భారత్‌లో క్షయ (టీబీ) వ్యాధి బారిన పడేవారి సంఖ్యను 2020కు ప్రతి లక్ష మందిలో 171 మందికి పరిమితం చేయాలనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యం కాగా, అది ఎంతగా నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌ఓ ఇటీవల వెల్లడించింది? (దేశంలో 2015-20 మధ్య టీబీ సంభావ్యత 0.5 శాతం మాత్రమే తగ్గిందని  డబ్ల్యూహెచ్‌ఓ పరిశోధనా పత్రంలో పేర్కొంది.)

జ: 213

  • స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూ ఎయిర్‌ సంస్థ  రూపొందించిన ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక-2023 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత      కాలుష్యంతో నిండిన మెట్రోపాలిటన్‌ ప్రాంతంగా ఏ రాష్ట్రంలోని బెగుసరాయ్‌ నిలిచింది? (ఘనపు మీటర్‌కు 118.9 మైక్రోగ్రాముల పీఎం 2.5 గాఢతతో ప్రపంచంలోనే అతి కాలుష్య మెట్రోపాలిటన్‌ ప్రాంతంగా ఇది నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో గువాహటి, దిల్లీ, పంజాబ్‌లోని ముల్లాన్‌పుర్‌లు ఉన్నాయి. మోస్ట్‌ పొల్యూటెడ్‌ క్యాపిటల్‌ సిటీగా దిల్లీ ఉంది. ఘనపు మీటర్‌కు 54.4 మైక్రోగ్రాములతో వార్షిక సూక్ష్మ ధూళికణాల (పీఎం 2.5) గాఢత ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. 79.9 మైక్రోగ్రాములతో బంగ్లాదేశ్, 73.7 మైక్రోగ్రాములతో పాకిస్థాన్‌ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.)

జ: బిహార్‌

  • యూఎస్‌ వాతావరణ శాఖ ‘ప్రపంచ వాతావరణ స్థితి’ పేరుతో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2023, మార్చి నుంచి 2024, ఫిబ్రవరి వరకు ఉన్న ఏడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా నిర్దేశిత 1.5 oC ను మించి సగటు ఉష్ణోగ్రత ఎంత మొత్తంగా నమోదైంది? (అంతకుముందు ఏడాది నమోదైన సగటు ఉష్ణోగ్రత 1.48 oC మాత్రమే. )

జ: 1.56 oC


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని