అంతర్గత అంకగణిత అభ్యాసమే సంగీతం!

విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకు బోధన లక్ష్యాలు తెలియాలి. బోధించాల్సిన అంశాలు, తీరు గురించి స్పష్టత ఉండాలి. ఇందుకోసం అనుసరించాల్సిన పద్ధతులపై అవగాహన కావాలి. ప్రతి పాఠం బోధన ద్వారా పిల్లల్లో వృద్ధి చెందే శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకోవాలి.

Published : 07 Jun 2024 00:19 IST

టీఆర్‌టీ - 2024    
గణితం మెథడాలజీ 

విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకు బోధన లక్ష్యాలు తెలియాలి. బోధించాల్సిన అంశాలు, తీరు గురించి స్పష్టత ఉండాలి. ఇందుకోసం అనుసరించాల్సిన పద్ధతులపై అవగాహన కావాలి. ప్రతి పాఠం బోధన ద్వారా పిల్లల్లో వృద్ధి చెందే శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకోవాలి. అందుకు అవసరమైన ఆచరణాత్మక కార్యక్రమాలను రూపొందించుకోవాలంటే అభ్యర్థులు బోధనా శాస్త్రంపై పట్టు పెంచుకోవాలి. అందుకోసం సంబంధిత సిద్ధాంతాలు, వాటిని ప్రతిపాదించిన పరిశోధకులు, వారు ఇచ్చిన వివరణలు, నిర్వచనాలను అధ్యయనం చేయాలి. 

 

ఉద్దేశాలు, లక్ష్యాలు, విలువలు

విద్య ముఖ్య ఉద్దేశం సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయడం. 

 • బోధనా కార్యక్రమంలో ముఖ్యంగా ఎదురయ్యేవి మూడు ప్రశ్నలు. అవి.. 
  1)ఏం బోధించాలి?  -  విద్యా ప్రణాళిక అంతటినీ
  2)ఎలా బోధించాలి?  -  బోధనా పద్ధతులు
  3)ఎందుకు బోధించాలి? -  విలువలు, ఉద్దేశాల కోసం; విద్యా ప్రమాణాల సాధనకు
 • గణితం, భాష, విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఒక్కొక్కటి కొన్ని శక్తి సామర్థ్యాలను అభివృద్ధిపరచగలిగిన శక్తులను కలిగి ఉంటాయి. ఈ శక్తులనే ‘విలువలు’ అంటారు.
 • గణిత శాస్త్ర బోధనకు కొన్ని శక్తులున్నాయి. వాటిని ‘గణిత బోధనా విలువలు’ అంటారు.
 • ఏ ప్రయోజనాలు ఆశించి గణితాన్ని బోధిస్తామో వాటిని ‘గణిత బోధనోద్దేశాలు’ అంటారు. వీటిని ఏకకాల ప్రమాణంలో, ఏక కార్యక్రమం ద్వారా యథాతథంగా పొందడం కుదరదు. 
 • గణిత బోధనోద్దేశాలను సిద్ధింపజేయడానికి వీటిని చిన్నచిన్న ఆచరణాత్మక కార్యక్రమాలుగా విభజిస్తారు. వాటిని ఏకకాల ప్రమాణంలో, ఏక కార్యక్రమం ద్వారా పొందడం సాధ్యమవుతుంది. ఈ చిన్నచిన్న ఆచరణాత్మక కార్యక్రమాల ఫలితాన్నే ‘లక్ష్యాలు’ అంటారు.
 • ఈ ఆచరణాత్మక కార్యక్రమాల ఫలితాలు విద్యార్థుల ప్రవర్తనలో కొన్ని మార్పులు తెస్తాయి. వాటినే ‘స్పష్టీకరణలు’ అంటారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని