కరెంట్‌ అఫైర్స్‌

సిమోన్‌ హారిస్‌ ఇటీవల ఏ దేశ ప్రధానిగా ఎంపికయ్యారు? (భారత సంతతికి చెందిన ప్రధాని లియో వరాద్కర్‌ రాజీనామా చేయడంతో ఆయన కేబినెట్‌లో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన సిమోన్‌ను ప్రధానిగా ఎన్నుకున్నారు.

Published : 07 Jun 2024 00:40 IST

మాదిరి ప్రశ్నలు

  • సిమోన్‌ హారిస్‌ ఇటీవల ఏ దేశ ప్రధానిగా ఎంపికయ్యారు? (భారత సంతతికి చెందిన ప్రధాని లియో వరాద్కర్‌ రాజీనామా చేయడంతో ఆయన కేబినెట్‌లో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన సిమోన్‌ను ప్రధానిగా ఎన్నుకున్నారు. 37 ఏళ్ల వయసులో ఈ పదవికి ఎంపికై, ఈ దేశ అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా ఘనత సాధించారు.)

జ: ఐర్లాండ్‌

  • జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నూతన డైరెక్టర్‌ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు? (2026, డిసెంబరు 31 వరకు ఈయన పదవిలో కొనసాగుతారు. బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రిసెర్చ్‌ డైరెక్టర్‌ జనరల్‌గా రాజీవ్‌ కుమార్‌ శర్మ నియమితులయ్యారు. జాతీయ విపత్తు స్పందనా దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) నూతన సారథిగా పీయూష్‌ ఆనంద్‌ నియమితులయ్యారు.)

జ: సదానంద్‌ వసంత్‌ దాతె

  • ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) తాజా నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది తీవ్ర ఆకలితో అలమటిస్తున్నారు? (2022లో ఉత్పత్తయిన ఆహారంలో 19 శాతం వృథా అయిందని, అది 100 కోట్ల టన్నులని నివేదిక పేర్కొంది. ఆహార వృథాను 2030 నాటికి సగానికి తగ్గించేందుకు కృషి చేయాలని ప్రపంచ దేశాలకు ఐరాస పిలుపునిచ్చింది.)

జ: 78.3 కోట్ల మంది

  • లాటిన్‌ అమెరికా క్లబ్‌ ఫుట్‌బాల్‌లో బరిలోకి దిగనున్న తొలి భారతీయ ప్లేయర్‌గా ఇటీవల ఎవరు వార్తల్లో నిలిచారు? (మణిపుర్‌కు చెందిన 22 ఏళ్ల ఈ క్రీడాకారుడితో ఉరుగ్వేకు చెందిన కొలాన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఒప్పందం చేసుకుంది.) 

జ: బిజయ్‌ ఛెత్రి   


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని