నోటినోఫికేషన్స్‌

కల్పక్కం (తమిళనాడు)లోని ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రిసెర్చ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ పరిధిలోని...

Published : 08 Jun 2024 01:56 IST

ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రిసెర్చ్‌లో పోస్టులు

ల్పక్కం (తమిళనాడు)లోని ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రిసెర్చ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ పరిధిలోని వివిధ యూనిట్లలో సైంటిఫిక్‌ ఆఫీసర్‌- ఇ/ డి/ సి, టెక్నికల్‌ ఆఫీస్‌- బి, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌- సి/ బి, నర్స్‌- ఎ, ఫార్మసిస్ట్‌- బి, టెక్నీషియన్‌- బి పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య 91. ఆసక్తి ఉన్నవారు 2024 జూన్‌ 30 లోగా దరఖాస్తు చేసుకోవాలి.


బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు 

పంజాబ్, చండీగఢ్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌) 2024 విద్యా సంవత్సరానికి బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో ప్రవేశానికి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు రుసుము రూ.1500. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్‌ 30లోగా దరఖాస్తు చేసుకోవాలి. 


హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో పోస్టులు 

హైదరాబాద్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్‌ లిమిటెడ్‌ సీఎంఎం ఇంజినీర్, మిడిల్‌ స్పెషలిస్ట్, జూనియర్‌ స్పెషలిస్ట్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు 20. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ 17 జూన్‌ 2024. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని