కరెంట్‌ అఫైర్స్‌

భారత్‌ ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 2024, జూన్‌ 6న జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో భారత్, కువైట్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ అతడికి ఆఖరిది.

Published : 08 Jun 2024 01:56 IST

భారత్‌ ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 2024, జూన్‌ 6న జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో భారత్, కువైట్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ అతడికి ఆఖరిది. 2005లో పాకిస్థాన్‌తో పోరుతో 21 ఏళ్ల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అతడు, ఇప్పుడు 39 ఏళ్ల వయసులో రిటైరయ్యాడు. 1984లో సికింద్రాబాద్‌లో పుట్టిన ఛెత్రి, 2002లో మోహన్‌ బగాన్‌ క్లబ్‌తో ప్రొఫెషనల్‌ కెరీర్‌ ప్రారంభించాడు.


కృత్రిమ మేధ (ఏఐ)లో సరికొత్త ఆవిష్కరణలు చేసిన అగ్రగామి 100 అంకురాల జాబితాను ‘టెక్నాలజీ పయనీర్స్‌ 2024’ పేరిట ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) విడుదల చేసింది. ఈ జాబితాలో భారతదేశం నుంచి 10 అంకురాలు ఉన్నాయి. స్వచ్ఛ ఇంధన ఆవిష్కారాలు, ఆరోగ్య సంరక్షణలో వినూత్నత, బయోటెక్, అంతరిక్ష, న్యూరోటెక్నాలజీల్లో ప్రగతి సాధించిన సంస్థలు ఇందులో ఉన్నాయి.


లండన్‌కు చెందిన క్వాక్వెరెల్లీ సైమండ్స్‌ (క్యూఎస్‌) 2024, జూన్‌ 5న ‘వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్‌-2025’ను ప్రకటించింది. దీని ప్రకారం, ప్రపంచంలోని 150 అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఐఐటీ బాంబే, ఐఐటీ దిల్లీ చోటు సంపాదించుకున్నాయి. అమెరికాకు చెందిన మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా 13వ సారి తన ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకుంది. 


తెలంగాణకి చెందిన అర్జున్‌ ఇరిగేశి ఫిడే ర్యాంకింగ్స్‌లో అయిదో స్థానంలో నిలిచాడు. లైవ్‌ రేటింగ్‌లో అతడు 2769.7 పాయింట్లతో ఉన్నాడు. ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే, 2834.5) మొదటి స్థానంలో ఉండగా, నకముర (అమెరికా, 2803.5), ఫాబియానో కరువానా (అమెరికా, 2796.7), నెపోమ్నియాషి (రష్యా, 2770.0) తర్వాతి స్థానాల్లో నిలిచారు.
కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని