నోటిఫికేషన్స్‌

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌) రీజనల్‌ రూరల్‌ బ్యాంకు (ఆర్‌ఆర్‌బీ)ల్లో కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌-శ్రీఖిఖిఖి (సీఆర్‌పీ) ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటన విడుదల చేసింది.

Published : 09 Jun 2024 00:31 IST

ఐబీపీఎస్‌ - గ్రామీణ బ్యాంకుల్లో  పోస్టులు

న్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌) రీజనల్‌ రూరల్‌ బ్యాంకు (ఆర్‌ఆర్‌బీ)ల్లో కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌-శ్రీఖిఖిఖి (సీఆర్‌పీ) ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 9,995 గ్రూప్‌ ఎ - ఆఫీసర్‌ (స్కేల్‌ - 1, 2, 3), గ్రూప్‌ బి - ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌) పోస్టులు భర్తీ చేస్తారు. పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు జూన్‌ 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


బీఎస్‌ఎఫ్‌లో ఏఎస్సై, హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ, ఏఆర్‌)లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్, హెడ్‌ కానిస్టేబుల్, వారెంట్‌ ఆఫీసర్, హవల్దార్‌ (క్లర్క్‌) ఖాళీల భర్తీకి బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. అస్సాం రైఫిల్‌ ఎగ్జామినేషన్‌-2024 ద్వారా ఖాళీలు భర్తీ చేస్తారు. మొత్తం పోస్టులు 1,526. అర్హులైన పురుష/ మహిళా అభ్యర్థులు జులై 8వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు

సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్‌సీఆర్‌ఐ) 2024-25 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (ఆనర్స్‌) ఫారెస్ట్రీ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. దరఖాస్తు రుసుము రూ.600. అర్హులైన అభ్యర్థులు జూన్‌ 27 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సీట్లలో 75 శాతం ఇంటర్‌ బైపీసీ విద్యార్థులకు, 25 శాతం ఎంపీసీ విద్యార్థులకు కేటాయించారు.

పూర్తి వివరాలు, మరిన్ని నోటిఫికేషన్ల కోసం 
క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని