కరెంట్‌ అఫైర్స్‌

ప్రపంచ ప్రఖ్యాత మనస్తత్వ వేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత  డేనియల్‌ కాన్‌మన్‌ (90) 2024, మార్చి 27న అమెరికాలోని మన్‌హట్టన్‌లో మరణించారు. ఈయన ఏ సంవత్సరంలో ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారాన్ని గెలుచుకున్నారు?

Published : 09 Jun 2024 00:36 IST

మాదిరి ప్రశ్నలు

  • ప్రపంచ ప్రఖ్యాత మనస్తత్వ వేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత  డేనియల్‌ కాన్‌మన్‌ (90) 2024, మార్చి 27న అమెరికాలోని మన్‌హట్టన్‌లో మరణించారు. ఈయన ఏ సంవత్సరంలో ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారాన్ని గెలుచుకున్నారు? (1993 నుంచి ఈయన ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. ఆర్థిక శాస్త్రం చదవకపోయినా ప్రవర్తనా ఆర్థిక శాస్త్రానికి ఈయన పర్యాయపదంగా మారారు. ఈయన రాసిన పుస్తకం ‘థింకింగ్, ఫాస్ట్‌ అండ్‌ స్లో’ అత్యంత ప్రజాదరణ పొందింది. 1934లో ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌లో కాన్‌మన్‌ జన్మించారు.)              

జ: 2002

  • అదానీ పవర్‌కు చెందిన పవర్‌ ప్రాజెక్ట్‌లో  ఏ సంస్థ 26 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఇటీవల ఈ రెండు పారిశ్రామిక దిగ్గజ సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదిరింది? (అంతేకాకుండా మధ్యప్రదేశ్‌లోని ఈ ప్లాంటుకు చెందిన 500 మెగావాట్ల యూనిట్‌లో ఉత్పత్తయ్యే విద్యుత్తును ఈ సంస్థ సొంత అవసరాలకు వినియోగించుకునేందుకు రెండు సంస్థలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.)

జ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌)

  • భారత అంపైర్‌ నితిన్‌ మేనన్‌ ఇటీవల ఎన్నోసారి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఎలైట్‌ ప్యానెల్‌లో చోటు దక్కించుకుని వార్తల్లో నిలిచాడు? (ఇందౌర్‌కు చెందిన నితిన్‌ 2020లో తొలిసారి ప్యానెల్‌లోకి వచ్చాడు. ఎస్‌.వెంకట్రాఘవన్, ఎస్‌.రవి తర్వాత ఎలైట్‌ ప్యానెల్‌లో చోటు పొందిన మూడో భారతీయ ఎంపైర్‌గా నితిన్‌ ఘనత సాధించాడు.)            

జ: అయిదోసారి

  • ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా గిన్నిస్‌ రికార్డుకెక్కిన 114 ఏళ్ల జువాన్‌ విసెంటీ పెంజ్‌ మోరా 2024, ఏప్రిల్‌ 2న మరణించారు. ఇతడు ఏ దేశానికి చెందిన వ్యక్తి? (జువాన్‌ 1909, మే 27న జన్మించారు. 2022, ఫిబ్రవరి 4 నుంచి ఈయన ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా వార్తల్లో ఉన్నారు.)

జ: వెనెజువెలా




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని