కరెంట్‌ అఫైర్స్‌

ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ప్రత్యేక ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? (ఈయన భారత జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) ఉన్నతాధికారి, విపత్తు ముప్పు తగ్గించే విషయాల్లో ఈయన  సెక్రటరీ జనరల్‌కు సలహాలు  ఇవ్వనున్నారు.

Published : 10 Jun 2024 01:15 IST

మాదిరి ప్రశ్నలు

ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ప్రత్యేక ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? (ఈయన భారత జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) ఉన్నతాధికారి, విపత్తు ముప్పు తగ్గించే విషయాల్లో ఈయన  సెక్రటరీ జనరల్‌కు సలహాలు ఇవ్వనున్నారు.)

జ: కమల్‌ కిషోర్‌

బహిరంగ ప్రదేశాల్లోని యూఎస్‌బీ ఛార్జింగ్‌ పాయింట్ల సాయంతో మొబైల్‌ ఫోన్లు ఛార్జింగ్‌ చేయొద్దని కేంద్ర ప్రభుత్వం తరఫున సీఈఆర్‌టీ-ఇన్‌ ఇటీవల హెచ్చరిక జారీ చేసింది. సీఈఆర్‌టీ-ఇన్‌ పూర్తి రూపం ఏమిటి? (బస్టాండ్లు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల లాంటి బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన యూఎస్‌బీ ఛార్జింగ్‌ స్టేషన్లను ఆసరాగా చేసుకుని కొందరు సైబర్‌ నేరగాళ్లు దాడులకు పాల్పడుతున్నారు. ఈ తరహా దాడులనే ‘జ్యూస్‌ జాకింగ్‌’ అంటారు. వీటితో జాగ్రత్తగా ఉండాలని సీఈఆర్‌టీ సూచించింది. ఇది కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అనుబంధ సంస్థగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.) 

జ: ది ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్‌టీ - ఇన్‌)

ప్రతిష్ఠాత్మక మయామీ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ - 1000 టెన్నిస్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో రోహన్‌ బోపన్న (భారత్‌) - మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జోడీ విజేతగా నిలిచింది. బోపన్న కెరీర్‌లో ఇది ఎన్నో అంతర్జాతీయ డబుల్స్‌ టైటిల్‌? (మాస్టర్స్‌ సిరీస్‌లో ఆరో టైటిల్‌. లియాండర్‌ పేస్‌ (2012) తర్వాత మయామీ ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన రెండో భారతీయ క్రీడాకారుడిగా బోపన్న గుర్తింపు పొందాడు.)

జ: 26వ

2024, ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన సవరించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనాల ప్రకారం దేశంలో ఏ రాష్ట్రంలో నైపుణ్యం లేని కార్మికులకు ఈ పథకం కింద చెల్లించే రోజువారీ వేతనం అత్యధికంగా రూ.374గా ఉంది? (అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్‌లలో అత్యల్పంగా రూ.234గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఏపీ, తెలంగాణాల్లో ఉపాధి హామీ రోజువారీ వేతనం రూ.300గా ఉంది.)

జ: హరియాణా


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (సీఎస్‌) సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ 2024, జూన్‌ 7న నియమితులయ్యారు. ఇప్పటి వరకు సీఎస్‌గా ఉన్న జవహర్‌ రెడ్డి స్థానంలో ఈ నియామకం జరిగింది. నీరభ్‌ 1987 ఐఏఎస్‌ బ్యాచ్‌కి చెందిన ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌ అధికారి. ప్రస్తుత నియామకానికి ముందు నీరభ్‌ ఏపీ పర్యావరణ, అటవీ, శాస్త్రసాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.


రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వరుసగా ఎనిమిదో ద్వైమాసిక పరపతి విధాన కమిటీ (ఎమ్‌పీసీ) సమావేశంలోనూ కీలక రేట్లను యథాతథంగానే ఉంచింది. 2022 మే తదుపరి 250 బేసిస్‌ పాయింట్ల మేర పెంచి, రెపోరేటును 6.5 శాతంగా చేసిన ఆర్‌బీఐ, 2023 ఏప్రిల్‌ నుంచి అందులో మార్పు చేయలేదు.

ఆర్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) వృద్ధిరేటు అంచనాలను 7% నుంచి 7.2 శాతానికి పెంచింది.


ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు (గ్లోబల్‌ రైస్‌ సమ్మిట్‌-2024) 2024, జూన్‌ 7న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అంతర్జాతీయ సరకుల (కమొడిటీస్‌) సంస్థ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా దీన్ని నిర్వహించాయి. గ్లోబల్‌ రైస్‌ సమ్మిట్‌కు భారత్‌లో ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. జూన్‌ 8న ఇది ముగిసింది.

కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని