కరెంట్‌ అఫైర్స్‌

క్యాన్సర్‌ చికిత్సకు తొలిసారి దేశీయంగా అభివృద్ధి చేసిన సీఏఆర్‌టీ -సెల్‌ థెరపీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఎక్కడ ప్రారంభించారు?

Updated : 11 Jun 2024 00:44 IST

 మాదిరి ప్రశ్నలు

  • క్యాన్సర్‌ చికిత్సకు తొలిసారి దేశీయంగా అభివృద్ధి చేసిన సీఏఆర్‌టీ -సెల్‌ థెరపీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? (ఈ జన్యు ఆధారిత చికిత్సా విధానాన్ని ఐఐటీ బాంబే, టాటా మెమోరియల్‌ సెంటర్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.)

జ: ఐఐటీ బాంబే


  • 2024, మే 3న న్యూయార్క్‌లో ఐరాస ఆర్థిక, సామాజిక మండలి (నిదివీళీవీది) మహిళా సాధికారతపై నిర్వహించిన సమావేశంలో భారత్‌ తరఫున పాల్గొని ప్రసంగించిన ముగ్గురు మహిళా సర్పంచ్‌లు ఎవరు? (‘భారత్‌లో స్థానిక సంస్థల పాలనలో మహిళల భాగస్వామ్యం, వారు ఎలా దారి చూపుతున్నారు’ అనే అంశంపై జరిగిన చర్చల్లో ఈ మహిళా ప్రతినిధులు పాల్గొని విజయగాథలను వినిపించడంతోపాటు లింగ సమానత్వం, అభివృద్ధి కోసం వారి పంచాయతీల్లో చేసిన కృషినీ పంచుకున్నారు.)

జ: హేమకుమారి (పశ్చిమగోదావరి జిల్లా, ఏపీ), సుప్రియాదాస్‌ దత్తా (త్రిపుర), నీరూ యాదవ్‌ (రాజస్థాన్‌).


  • భారత ఆర్థిక వ్యవస్థ 2024లో ఎంత శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక అంచనా వేసింది? (గతంలో అంచనా వేసిన వృద్ధిరేటు కంటే ఇది 1.2 శాతం ఎక్కువ. నివేదిక ప్రకారం 2024, 2025లలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందే ప్రాంతంగా దక్షిణాసియా నిలుస్తుంది.)

జ: 7.5 శాతం


  • దేశీయంగా 10,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించిన తొలి కంపెనీగా ఏ సంస్థ వార్తల్లో నిలిచింది?

జ: అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (ఏజీఈఎల్‌)Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు