కరెంట్‌అఫైర్స్‌

ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయన్స్‌ (ఐఎస్‌ఏ)లో 97వ సభ్యదేశంగా ఏ దేశం చేరింది?

Published : 12 Jun 2024 00:49 IST

మాదిరి ప్రశ్నలు

ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయన్స్‌ (ఐఎస్‌ఏ)లో 97వ సభ్యదేశంగా ఏ దేశం చేరింది?         

జ: పనామా


2024 మార్చిలో ఏ దక్షిణ అమెరికా దేశం డెంగీ జ్వరాల పెరుగుదల కారణంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది?

జ: పెరూ   


కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ రెండు రాష్ట్రాల్లో ఫ్లూ-క్యూర్డ్‌ వర్జీనియా (ఎఫ్‌సీవీ) పొగాకు పెంపకందారులకు మద్దతుగా చర్యలు చేపట్టింది? 

జ: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక


ఏబీ - పీఎమ్‌జేఏవై (ఆయుష్మాన్‌ భారత్‌-ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన) కింద ఐదు కోట్ల ఆయుష్మాన్‌ కార్డులను జారీ చేసినమొదటి రాష్ట్రం?

జ: ఉత్తర్‌ప్రదేశ్‌    


అంతర్జాతీయ నిరాయుధీకరణ, వ్యాప్తి నిరోధక అవగాహన దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు?

జ: మార్చి 5  


ఏ రాష్ట్రంలోని దిగువ సుబంసిరి జిల్లా నుంచి విడిపోయి కీయి పన్యోర్‌ ఆ రాష్ట్రంలో 26వ జిల్లాగా అవతరించింది?

జ: అరుణాచల్‌ ప్రదేశ్‌


2024 సాధారణ ఎన్నికల్లో ఎన్నేళ్లు పైబడిన వృద్ధులకు కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా హోం ఓటింగ్‌కు అవకాశం కల్పించింది?

జ: 85 సంవత్సరాలు 


ఇటీవల వార్తల్లోకి వచ్చిన ‘నైనాతీవు’ ద్వీపం ఏ జలసంధిలో ఉంది?

జ: పాక్‌ జలసంధి


అంతర్జాతీయ గణిత దినోత్సవాన్ని (ఐడీఎమ్‌) ఏటా ఏ రోజున నిర్వహిస్తారు?

జ: మార్చి 14   Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని