నోటీస్‌బోర్డు

సంస్థ: ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీ(ఐఎంయూ), చెన్నై. పోస్టులు: ప్రొఫెసర్‌-16, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-31...

Published : 31 Jul 2018 01:51 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

మారిటైమ్‌ యూనివర్సిటీలో టీచింగ్‌ పోస్టులు
సంస్థ: ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీ(ఐఎంయూ), చెన్నై.
పోస్టులు: ప్రొఫెసర్‌-16, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-31, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-27. మొత్తం ఖాళీలు: 74 
విభాగాలు: మెరైన్‌/ ఓషియన్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, నాటికల్‌ సైన్స్‌ తదితరాలు. అర్హత: ఐఎంయూ నిబంధనల ప్రకారం.
వయసు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు 50 ఏళ్లు, మిగిలినవాటికి 60 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ: 01.08.2018 నుంచి 30.08.2018 వరకు. వెబ్‌సైట్‌: www.imu.edu.in

జిప్‌మర్‌లో ప్రొఫెసర్లు

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌లో టీచింగ్‌ పోస్టుల భర్తీ. పోస్టులు: ప్రొఫెసర్‌- 37, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌- 30. మొత్తం ఖాళీలు: 67. విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, కార్డియాలజీ, ఈఎన్‌టీ, మెడిసిన్‌, న్యూరాలజీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, సర్జరీ తదితరాలు.
అర్హత: ఎంబీబీఎస్‌, పీజీ, ఎండీ, ఎంఎస్‌, డీఎం, ఎసీహెచ్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధనానుభవం ఉండాలి.
వయసు: ప్రొఫెసర్‌ ఉద్యోగానికి 58 ఏళ్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు 50 ఏళ్లు మించకూడదు. ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 31.08.2018. వెబ్‌సైట్‌:www.jipmer.edu.in

ఐటీ రిసోర్స్‌ పర్సన్లు

దిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ఒప్పంద ప్రాతిపదికన ఐటీ రిసోర్స్‌ పర్సన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు.
పోస్టు-ఖాళీలు: డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ప్రోగ్రామర్‌ అసిస్టెంట్‌- 02, ప్రోగ్రామర్‌- 01, సిస్టమ్‌ అనలిస్ట్‌- 02, సీనియర్‌ ప్రోగ్రామర్‌- 05. అర్హత: పన్నెండో తరగతి, టైపింగ్‌ పరిజ్ఞానం, సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంసీఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం తప్పనిసరి. ఎంపిక‌: రాత/ నైపుణ్య పరీక్షలు, టైపింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ: 06.08.2018 నుంచి 12.08.2018 వరకు. వెబ్‌సైట్‌:www.nielit.gov.in

జేఎన్‌టీయూకేలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

కాకినాడలోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ తాత్కాలిక ప్రాతిపదికన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (సివిల్‌ ఇంజినీరింగ్‌)
అర్హత: మొదటి శ్రేణిలో పీజీ(హైడ్రాలిక్స్‌ అండ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత. ఈమెయిల్‌ దరఖాస్తు చివరితేది: 04.08.2018.
ఈమెయిల్‌: principal_jntuk@yahoo.com
రాతపరీక్ష/ ఇంటర్వ్యూ తేది: 07.08.2018.  వెబ్‌సైట్‌: www.jntuk.edu.in

అప్రెంటిస్‌షిప్‌

సీపీసీఎల్‌లో ఖాళీలు
చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.
ట్రేడులు: ఫిట్టర్‌, వెల్డర్‌, ఎలక్ట్రీషియన్‌, మెకానిక్‌, మెషినిస్ట్‌, టర్నర్‌, సీవోపీఏ, ల్యాబ్‌ అసిస్టెంట్‌, ఏఏవో, అకౌంటెంట్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌, ఎగ్జిక్యూటివ్‌, సెక్యూరిటీ గార్డ్‌ తదితరాలు. ఖాళీల సంఖ్య: 142
అర్హత: ఎనిమిది/ పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ, సీఏ/ ఐసీడబ్ల్యూఏ, బ్యాచిలర్‌/మాస్టర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. వయసు: 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: విద్యార్హత మార్కుల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేది: 12.08.2018. వెబ్‌సైట్‌: www.cpcl.co.in

ప్రవేశాలు

తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌లో సివిల్స్‌ శిక్షణ
యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్‌(ప్రిలిమ్స్‌)కు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణలో ప్రవేశాలకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌ దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అర్హులు. కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతమైతే రూ.2.00 లక్షలకు మించకూడదు. సీట్ల సంఖ్య: 500 శిక్షణ కాలం: 9 నెలలు.
శిక్షణ కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌. ఎంపిక: ప్రవేశపరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 12.08.2018.
వెబ్‌సైట్‌:  http://studycircle.cgg.gov.in/tsbcw/Index.do

మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని