APPSC: గ్రూప్-1 నోటిఫికేషన్‌ విడుదల.. పోస్టులు ఎన్నంటే?

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదలైంది. 

Updated : 08 Dec 2023 16:31 IST

APPSC Group 1 Notification| అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా రాష్ట్రంలో మొత్తం 81 Group 1 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ (APPSC) వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రిలిమినరీ పరీక్ష మార్చి 17న నిర్వహిస్తారు. ఆఫ్‌లైన్‌ మోడ్‌లో ఆబ్జెక్టివ్‌ విధానంలో ఈ పరీక్ష ఉంటుంది. డిస్క్రిప్టివ్‌ విధానంలో నిర్వహించబోయే మెయిన్‌ పరీక్ష తేదీని ఇంకా ఖరారు చేయలేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిన్న 897 గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  

పోస్టుల వివరాలివే..

ఏపీ సివిల్‌ సర్వీస్‌ (ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌) డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు 9; ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ 18; డీఎస్పీ (సివిల్‌) 26; రీజనల్‌ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్‌ 6; కోఆపరేటివ్‌ సర్వీసెస్‌లో డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టులు 5; జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ 4; జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 3; అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ అకౌంట్స్‌ అధికారి పోస్టులు 3; అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ 2; జైళ్ళ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్‌,  జిల్లా బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌ II, అసిస్టెంట్ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. పరీక్ష విధానం, సిలబస్ తదితర పూర్తి వివరాలను ఈ కింది పీడీఎఫ్‌లో చూడొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని