APPSC: ఏపీలో గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.

Updated : 07 Dec 2023 20:53 IST

APPSC Group 2 Notification | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. డిగ్రీ, ఆపై విద్యార్హత కలిగిన వారు గ్రూప్-2 ఉద్యోగాలకు అర్హులు. నూతన సిలబస్‌ ప్రకారమే గ్రూప్‌-2 పరీక్ష ఉంటుందని ఏపీపీఎస్సీ(APPSC) స్పష్టం చేసింది. మొత్తం 897 పోస్టుల భర్తీకి గ్రూప్-2 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో 331  ఎగ్జిక్యూటివ్‌, 566 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు ఉన్నాయి. ఈనెల 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

గ్రూప్‌-2 ఉద్యోగాలకు స్క్రీనింగ్‌ పరీక్ష (ప్రిలిమినరీ పరీక్ష) ఫిబ్రవరి 25న నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్‌ పరీక్షకు షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. మెయిన్‌ పరీక్ష తేదీలను తర్వాత ప్రకటిస్తారు. మెయిన్‌ రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ పరీక్ష(CPT) నిర్వహిస్తారు.  స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్‌ పరీక్ష రెండూ ఆఫ్‌లైన్‌ మోడ్‌(ఓఎంఆర్‌) ఆబ్జెక్టివ్‌ విధానంలోనే జరుగుతాయి. పోస్టుల ఖాళీల వివరాలు, పరీక్ష విధానం తదితర కీలక అంశాలు ఈ కింది పీడీఎఫ్‌లో చూడొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని