IBPS PO Prelims: ఐబీపీఎస్‌ పీవో/ఎంటీ ప్రిలిమ్స్‌ పరీక్ష స్కోర్‌ కార్డు ఇదిగో!

ఐబీపీఎస్‌ పీవో/ఎంటీ ప్రిలిమ్స్‌ పరీక్ష స్కోరు కార్డులు విడుదలయ్యాయి. IBPS PO ప్రిలిమ్స్‌ ఆన్‌లైన్‌ పరీక్ష రాసిన అభ్యర్థులు ఈ కింది లింక్‌పై క్లిక్‌ చేయడం ద్వారా తమ స్కోరు కార్డు పొందొచ్చు.

Published : 25 Oct 2023 19:26 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్‌ ఆన్‌లైన్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ ఫలితాలను విడుదల చేసిన ఐబీపీఎస్‌ అధికారులు తాజాగా ఆన్‌లైన్‌ స్కోరు కార్డులను అందుబాటులో ఉంచారు. ఈ స్కోరు కార్డుల్ని అక్టోబర్‌ 25 నుంచి నవంబర్‌ 5వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వీటిని పొందేందుకు అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌/రోల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌/పుట్టిన తేదీ వివరాలు, క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

స్కోర్‌ కార్డు కోసం క్లిక్‌ చేయండి

ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (ఐబీపీఎస్‌ పీవో/ ఎంటీ-XIII 2024-25) ప్రకటన ద్వారా మొత్తం 3,049 పీవో ఉద్యోగాల భర్తీకి ఆగస్టు 1 నుంచి 28వరకు దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే.  సెప్టెంబర్‌ 23, 30, అక్టోబర్‌ 1 తేదీల్లో ప్రిలిమ్స్‌ ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించిన అధికారులు.. తాజాగా స్కోరు కార్డును అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఐబీపీఎస్‌ మెయిన్‌ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్‌ ఎగ్జామ్‌ ద్వారా పీవో పోస్టులకు పోటీపడాల్సి ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని