Exam Results: ఐబీపీఎస్‌ క్లర్క్‌ పోస్టులు 5,650.. ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్‌..

IBPS clerk Results: బ్యాంకు క్లర్క్‌ ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్‌ నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

Published : 06 Sep 2023 21:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా రీజినల్‌ రూరల్‌ బ్యాంకు (RRB)ల్లో 5650 క్లర్క్‌/ఆఫీస్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి IBPS నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆగస్టు 12, 13, 19 తేదీల్లో ఆన్‌లైన్‌లో జరిగిన ఈ పరీక్ష ఫలితాలను ఐబీపీఎస్‌ అధికారులు బుధవారం విడుదల చేశారు. అభ్యర్థులు Ibps.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. IBPS clerk results 2023 అనే లింక్‌పై క్లిక్‌ చేయడం ద్వారా అభ్యర్థులు తమ ఫలితాలను పొందొచ్చు. ఇందుకోసం రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌/పుట్టిన తేదీ వివరాలు, క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా స్కోరు కార్డును ఈ నెల 19వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పైన పేర్కొన్న తేదీ లోపు మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని