Bank Jobs: ఐడీబీఐలో 2,100 ఉద్యోగాలు.. వేతనం ఎంతంటే?

ఐడీబీఐ బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 6వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

Published : 23 Nov 2023 01:54 IST

IDBI Job Recruitment | ఇంటర్నెట్‌ డెస్క్‌: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (IDBI)లో పెద్ద సంఖ్యలో  ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తంగా 2,100 ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వీటిలో 800 పోస్టులు జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ (గ్రేడ్‌ ‘ఓ’ పోస్టులు ఉండగా..  ఒప్పంద ప్రాతిపదికన 1,300 సేల్స్‌, ఆపరేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌(ESO) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 22 నుంచి డిసెంబర్‌ 6వరకు ఆన్‌లైన్‌ https://www.idbibank.in/idbi-bank-careers-current-openings.aspxలో దరఖాస్తులు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌లో 10 కీలక అంశాలివే.. 

  • వయో పరిమితి: జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌, కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించే ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల కనీస వయస్సు  20 నుంచి 25 ఏళ్లు మించరాదు. రిజర్వేషన్‌ ఆధారంగా ఆయా వర్గాలకు వయో సడలింపు ఇచ్చారు.
  • విద్యార్హతలు: ఏదైనా డిగ్రీ.  ఓబీసీ, జనరల్‌ అభ్యర్థులు డిగ్రీలో 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. అదే, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులైతే 55శాతంమార్కులతో పాసైతే చాలు. ఎగ్జిక్యూటివ్‌ (కాంట్రాక్టు)  ఉద్యోగాలకు మాత్రం ఏదైనా డిగ్రీ ఉండే సరిపోతుంది. డిప్లొమా మాత్రమే పూర్తి చేసిన వాళ్లు ఈ రెండు ఉద్యోగాలకూ అనర్హలు.
  • వేతనం: ఉద్యోగంలో చేరిన తరువాత జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌(JAM)కు రూ.6.14లక్షల నుంచి రూ. 6.50లక్షల వార్షిక ప్యాకేజీతో వేతనం ఇస్తారు. పనితీరును బట్టి ఏటా ఇంక్రిమెంట్‌ ఉంటుంది. ఐడీబీఐ బ్యాంకు లిమిటెడ్‌ నూతన పింఛను స్కీమ్‌ పరిధిలోకి వస్తుంది. 
  • JAM పోస్టులకు ఏడాది పాటు ప్రొబేషన్‌ ఉంటుంది. బ్యాంకు ఎక్కడ నియమించినా పనిచేయాల్సి ఉంటుంది. 
  • ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు తొలి ఏడాది నెలకు రూ.29వేలు చొప్పున వేతనం ఇస్తారు. రెండో సంవత్సరం నుంచి నెలకు రూ.31వేలు చొప్పున చెల్లిస్తారు.  ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలను పూర్తిగా కాంట్రాక్టు ప్రాతిపదికన నియమిస్తారు. 
  • ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఏడాది పాటు పనిచేయాల్సి ఉంటుంది. ఆ సంవత్సరంలో అతడి పనితీరును సమీక్షించిన తర్వాత మరో ఏడాది పొడిగిస్తారు. రెండేళ్ల పాటు సర్వీసును విజయవంతంగా పూర్తి చేసిన వారికి జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌(JAM) పోస్టుల ఎంపిక ప్రక్రియలో అధిక ప్రాధాన్యం ఇచ్చే ఛాన్స్‌ ఉంటుంది. 
  • దరఖాస్తు రుసుం: దరఖాస్తు రుసుం రూ.1000, ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు ఇంటిమేషన్‌ ఛార్జీల కింద రూ.200 చెల్లిస్తే చాలు.
  • ఎంపిక ప్రక్రియ: జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌(JAM), ఎగ్జిక్యూటివ్‌ సేల్స్‌ -ఆపరేషన్స్‌ (ESO) పోస్టులకు ఆన్‌లైన్‌ పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ, ప్రీ రిక్రూట్‌మెంట్‌ మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
  • ఆన్‌లైన్‌ పరీక్ష: జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌(JAM)పోస్టులకు డిసెంబర్‌ 31న; ఎగ్జిక్యూటివ్‌ (సేల్స్‌, ఆపరేషన్స్‌(ESO) ఉద్యోగాలకు డిసెంబర్‌ 30న ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు.
  • పరీక్ష విధానం ఇలా..: లాజికల్‌ రీజనింగ్‌, డేటా ఎనాలసిస్‌, ఎంటర్‌ప్రిటేషన్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌/కంప్యూటర్‌/ఐటీ సబ్జెక్టులపై 200 ప్రశ్నలు అడుగుతారు. రెండు గంటల పాటు పరీక్ష ఉంటుంది. ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో మాత్రమే పరీక్ష ఉంటుంది. కంప్యూటర్‌పై అవగాహన కలిగి ఉండాలి. 
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే.. చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం; తెలంగాణలో హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని