Bank Jobs: భారీ వేతనం.. IOBలో ఆఫీసర్‌ ఉద్యోగాలు

ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకులో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Updated : 13 Nov 2023 08:59 IST

Bank Jobs Recruitment| ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు (IOB)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. చెన్నై ప్రధాన కేంద్రంగా దేశవ్యాప్తంగా సేవలందిస్తోన్న ఈ బ్యాంకులో  వివిధ విభాగాల్లో మొత్తం 66 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 19 వరకు ఆన్‌లైన్‌ https://www.iob.in/Careersలో దరఖాస్తు చేసుకోవచ్చు.

  • విద్యార్హతలు: లా, బీఈ/బీటెక్‌/ఎంటెక్‌, బీఆర్క్‌, ఏదైనా డిగ్రీ , సీఏ/ఎంసీఎ/ఎమ్మెస్సీ/ఎంబీఏ/పీజీడీబీఎం, సీబీసీఏ/సీఏ ఉత్తీర్ణత
  • అనుభవం: సంబంధిత విభాగాల్లో కొంత కాలం పాటు పనిచేసిన అనుభవం తప్పనిసరి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.
  • వేతనం: పోస్టులను బట్టి కనిష్ఠంగా రూ.48 వేలు నుంచి గరిష్ఠంగా రూ.89వేల వరకు వేతనం ఉంటుంది. ఉద్యోగంలో చేరిన రోజు నుంచి రెండేళ్ల పాటు ప్రొబేషన్‌ ఉంటుంది.
  • వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు 25 - 40 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయ వర్గాల వారికి వయో సడలింపు ఉంది.
  • దరఖాస్తు రుసుం: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు కేవలం ఇంటిమేషన్‌ ఛార్జీల కింద రూ.175లు. ఇతరులు (ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ కలిపి) రూ.850లు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
  • ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని