JEE Main 2023: త్వరలో జేఈఈ మెయిన్ (సెషన్ 2) అడ్మిట్ కార్డులు.. ఇలా చెక్ చేసుకోవచ్చు!
JEE main (session 2) exam: జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష అడ్మిట్‌కార్డులు త్వరలోనే విడుదల కానున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ (JEE Main 2023) సెషన్-2కు సంబంధించి అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) త్వరలోనే విడుదల చేయనుంది. ఏప్రిల్ 6 నుంచి 12 తేదీల మధ్య జరిగే ఈ పరీక్షలకు ఈ వారం రోజుల్లోనే అడ్మిట్ కార్డులను విడుదల చేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. జేఈఈ మెయిన్ (సెషన్ 2) పరీక్ష కోసం అభ్యర్థులు ఫిబ్రవరి 8 నుంచి మార్చి 12వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకున్న విషయం తెలిసిందే. అడ్మిట్ కార్డులతో పాటు పరీక్షలకు సంబంధించిన సమాచారం కోసం తమ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in, Nta.ac.inలలో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ ఇలా..
- jeemain.nta.nic.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
- హోంపేజీలో జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు 2023 సెషన్-2కు సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అవ్వాలి.
- జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై కనబడుతుంది.
- ఆ తర్వాత దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓ కాపీని ప్రింటవుట్ తీసుకుని పెట్టుకోవాలి.
- కార్డుపై మీరు పరీక్ష రాసే నగరం పేరు, ఇతర వివరాలన్నీ ఉన్నాయో, లేదో సరిచూసుకోండి.
- ఏదైనా సమస్య ఉంటే jeemain@nta.ac.in. ద్వారా ఎన్‌టీఏకు ఇ-మెయిల్ చేయొచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Weather Report: తెలంగాణలో రాగల 3రోజులు మోస్తరు వర్షాలు
-
Sports News
MS Dhoni: ‘ధోనీ అంటే కేవలం లీడర్ మాత్రమే కాదు.. ఓ ఎమోషన్’
-
Politics News
Harishrao: రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ప్రకృతి వైపరీత్యాల కంటే డేంజర్: మంత్రి హరీశ్‌రావు
-
World News
China: బోయింగ్, ఎయిర్‌బస్‌కు పోటీగా చైనా ప్యాసింజర్ విమానం..!
-
India News
wrestlers Protest: పార్లమెంట్ వైపు దూసుకెళ్లిన రెజ్లర్ల నిర్బంధం.. దిల్లీలో ఉద్రిక్తత!
-
Movies News
Shaakuntalam: ‘కేన్స్’లో శాకుంతలం మెరుపులు.. స్పందించిన సమంత