TSPSC: జూనియర్‌ లెక్చరర్‌ నియామక పరీక్ష హాల్‌ టికెట్లు విడుదల

జేఎల్‌ పరీక్ష హాల్‌ టికెట్లను గురువారం టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. సెప్టెంబర్‌ 12 నుంచి రాత పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Published : 07 Sep 2023 19:14 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 1392 జూనియర్‌ లెక్చరర్‌ల నియామక రాత పరీక్షలు సెప్టెంబర్‌ 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు అక్టోబర్‌ 3 వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో జేఎల్‌ పరీక్ష హాల్‌ టికెట్లను గురువారం టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

కంప్యూటర్ ఆధారిత విధానంలో జేఎల్‌ పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 16 సబ్జెక్టులకు 11 రోజుల పాటు ఉదయం జనరల్ స్టడీస్ పేపర్, మధ్యాహ్నం సంబంధిత సబ్జెక్టు పేపర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) పరీక్ష తేదీలను ఇప్పటికే విడుదల చేసింది. మల్టీజోన్‌-1లో 724, మల్టీజోన్‌-2లో 668 పోస్టులను భర్తీ కానున్నాయి. కమిషన్‌ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు ప్రకటన వెలువడటం ఇదే తొలిసారి.

హాల్‌ టికెట్‌ కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని