Jobs In HPS: రామంతాపూర్‌ హెచ్‌పీఎస్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు.. అర్హతలివే..!

హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌-రామంతాపూర్‌లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

Updated : 09 Jan 2024 17:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్నారులకు బోధించడం, వారిలో నాయకత్వాన్ని పెంపొందించడం పట్ల ఆసక్తి కలిగిన వారికి హైదరాబాద్ పబ్లిక్‌ స్కూల్‌-రామంతాపూర్‌ మంచి అవకాశం కల్పిస్తోంది. ఈ పాఠశాలలో బోధన, బోధనేతర ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తికలిగిన అభ్యర్థులు జనవరి 18వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. పీజీటీ, టీజీటీ, పీఎస్‌టీ, జూనియర్‌ సిస్టమ్స్‌ అడ్మినిస్ట్రేటర్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అయితే, మొత్తం ఖాళీలెన్ని? వేతనం ఎంత? తదితర వివరాలను మాత్రం వెల్లడించలేదు.

ఖాళీ పోస్టులు ఇవే.. 

  • పీజీటీ అకౌంటెన్సీ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌; పొలిటికల్‌ సైన్స్‌; సైకాలజీ; సోషియాలజీ
  • టీజీటీ మేథమెటిక్స్‌; ఫిజిక్స్‌; కెమిస్ట్రీ; కెరీర్‌ కౌన్సెలర్‌; స్పెషల్‌ ఎడ్యుకేటర్‌; యోగా ఇన్‌స్ట్రక్టర్‌
  • పీఎస్‌టీ మేథమెటిక్స్‌; కంప్యూటర్‌ సైన్స్‌; వెస్ట్రన్‌ మ్యూజిక్‌
  • ఇంటర్వెన్షన్‌ టీచర్స్‌; స్పెషల్‌ ఎడ్యుకేటర్స్‌; నర్సరీ టీచర్స్‌
  •  జూనియర్‌ సిస్టమ్స్‌ అడ్మినిస్ట్రేటర్‌; ఫిజిక్స్‌; కెమిస్ట్రీ, బయాలజీ
  • ల్యాబ్‌ అసిస్టెంట్‌ (సీనియర్‌ బ్లాక్‌కు);  కంప్యూటర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌ (ప్రైమరీ), అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ (ప్రైమరీ)

కొన్ని అర్హతలివే.. 

  • అభ్యర్థుల వయస్సు 45 ఏళ్ల కన్నా తక్కువ ఉండాలి. (కొన్ని సందర్భాల్లో వయో సడలింపు ఉంది)
  • ఇంగ్లిష్‌లో మంచి కమ్యూనికేషన్‌ నైపుణ్యం ఉండాలి.  (రాయడం, మాట్లాడటంలో)
  • కంప్యూటర్‌ వాడటంలో ప్రావీణ్యం తప్పనిసరి.
  • ప్రతిష్ఠాత్మకమైన పాఠశాలల్లో మూడు నుంచి ఐదేళ్ల పాటు పనిచేసిన అనుభవం.
  • అకడమిక్‌లో కనీసం 50శాతం మార్కులతో పాటు ప్రొఫెషనల్‌ క్వాలిఫికేషన్స్‌ ఉండాలి. 
  • టెట్‌/సీటెట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • వేర్వేరు పోస్టులకు అర్హతలు ఉన్నా ఒక అభ్యర్థి ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వేర్వేరు స్కూళ్లు/పోస్టులకు వేర్వేరు దరఖాస్తులను తిరస్కరిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు గూగుల్‌ ఫారమ్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
  • పూర్తి వివరాల కోసం www.hpsramanthapur.org వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా సందేహాలు ఉంటే career@hpsramanthpur.orgకి మెయిల్‌ చేయవచ్చు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని