Jobs: ఐటీఐతో ECILలో 1,100 పోస్టులు.. 16 వరకే దరఖాస్తులకు ఛాన్స్‌!

ఐటీఐ విద్యార్హతతో హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లో ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే జూనియర్‌ టెక్నీషియన్‌ (గ్రేడ్‌ -2) పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.

Updated : 12 Jan 2024 21:20 IST

ECIL Job Recruitment| ఇంటర్నెట్‌డెస్క్‌: హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (ECIL)లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఐటీఐ విద్యార్హతతో కాంట్రాక్టు ప్రాతిపదికన మొత్తం 1100 జూనియర్‌ టెక్నీషియన్‌ (గ్రేడ్-2) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు.  ఈ ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన వారు జనవరి 16న సాయంత్రం 4గంటల వరకు ఆన్‌లైన్‌ https://www.ecil.co.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఈ ఒప్పందం నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ప్రాజెక్టు అవసరాలు, అభ్యర్థుల పనితీరును బట్టి మరో రెండు మాసాల పాటు పొడిగించే అవకాశం ఉంటుంది.

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..

  • మొత్తం పోస్టుల్లో ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ 275; ఎలక్ట్రీషియన్‌ 275; ఫిట్టర్‌ 550 చొప్పున పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
  • అభ్యర్థుల గరిష్ఠ వయో పరిమితి జనవరి 16, 2024 నాటికి 30 ఏళ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులకు రిజర్వేషన్‌ ఆధారంగా వయో సడలింపు కల్పించారు. 
  • నెలకు వేతనం రూ.22,528 చెల్లిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మెడికల్‌ ఇన్సూరెన్స్‌, కంపెనీ పీఎఫ్‌, టీ/డీఏతో పాటు పెయిడ్‌లీవ్‌ వంటి సౌకర్యాలు ఉంటాయి.
  • విద్యార్హతలు: ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ ఎలక్ట్రీషియన్/ ఫిట్టర్ ట్రేడ్స్‌లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు ఏడాది అప్రెంటిస్‌షిప్‌; ప్రభుత్వ రంగ ఎలక్ట్రానిక్ సంస్థల్లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
  • ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థుల్ని ట్రేడ్‌ల వారీగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. డాక్యుమెంట్‌వెరఫికేషన్‌ తేదీ, సమయాన్ని వెబ్‌సైట్‌లో ఆ తర్వాత పొందుపరుస్తారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని