Kendriya Vidyalaya: కేవీల్లో పీఆర్టీ అభ్యర్థులకు కీలక అప్‌డేట్‌.. కాల్‌ లెటర్లు డౌన్‌లోడ్‌ చేసుకోండి!

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రైమరీ టీచర్‌ పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు కాల్‌ లెటర్లు అందుబాటులోకి వచ్చాయి. 

Published : 30 Oct 2023 16:07 IST

దిల్లీ: దేశ వ్యాప్తంగా వున్న కేంద్రీయ విద్యాలయాల్లో 6,414 ప్రైమరీ టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు కీలక అప్‌డేట్‌ వచ్చింది. నవంబర్‌ 3 నుంచి 9వరకు ఇంటర్వ్యూలు నిర్వహించే నగరాల జాబితాను కేంద్రీయ విద్యాలయ సంఘఠన్‌(KVS) సోమవారం విడుదల చేసింది. ముంబయి, లఖ్‌నవూ, దిల్లీ, దేహ్రాదూన్‌, చండీగఢ్‌, నోయిడా నగరాల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొంది. అలాగే, ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు తమ కాల్‌ లెటర్లను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కేవీ అసిస్టెంట్‌ కమిషనర్‌(అడ్మిన్‌) శశికాంత్‌ శర్మ ఓ ప్రకటనలో సూచించారు. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులు ఈ లింక్‌ https://kvsangathan.nic.in/పై క్లిక్‌ చేసి తమ కాల్‌ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాల్‌ లెటర్‌ పొందేందుకు అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో పాటు సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. 

కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన ప్రైమరీ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి కేవీ సంఘటన్‌ నిర్వహించిన రాత పరీక్ష (రివైజ్డ్‌) ఫలితాలు అక్టోబర్‌ 27న విడుదలైన విషయం తెలిసిందే. మొత్తం 6,414 పోస్టులకు గాను 20,234 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. రాత పరీక్ష, క్లాస్ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి వేతన స్కేలు రూ.35,400-రూ.1,12,400గా వుంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు