Kendriya vidyalaya Results: కేవీల్లో పీజీటీ సహా పలు పరీక్షల ఫలితాలు విడుదల

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో(Kendriya Vidyalaya) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ఆధారంగా టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీ కోసం కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌(Kendriya Vidyalaya Sangathan) నిర్వహించిన పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ వెబ్‌సైట్‌ వివరాలు పొందుపరిచారు. 

Published : 28 Oct 2023 01:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో(Kendriya Vidyalaya) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ఆధారంగా టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీ కోసం కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ నిర్వహించిన పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. ఇక ఇటీవల విడుదల చేసిన ప్రైమరీ టీచర్‌ పోస్టుల(PRT) రాత పరీక్ష రివైజ్డ్‌ ఫలితాలను సైతం విడుదల చేశారు. మొత్తం 6414 పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల రివైజ్డ్‌ జాబితాను వెల్లడించారు. వీటితో పాటు జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(JSA), పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(PGT), అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌(ASO), సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(SSA) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రోవిజినల్‌ జాబితాను వెల్లడించారు. వీటితో పాటు వైస్‌ ప్రిన్సిపల్‌(Vice Principal) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈమేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌(Kendriya Vidyalaya Sangathan) వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపరిచారు. పలు పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం కింద లింక్‌లు క్లిక్‌ చేయండి..  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు