KVS PRT Results: కేంద్రీయ విద్యాలయ ప్రైమరీ టీచర్ల రాత పరీక్ష ఫలితాలు విడుదల

దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో(KVS) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన ప్రైమరీ టీచర్ల పోస్టులకు(PRT) సంబంధించిన నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి.

Updated : 20 Oct 2023 00:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో(Kendriya Vidyalaya) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ఆధారంగా ప్రైమరీ టీచర్ల పోస్టులకు(PRT) నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు(KVS PRT Results) విడుదలయ్యాయి. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంగఠన్‌ ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. మొత్తం 6414 పోస్టులకు సంబంధించి గత ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. ఇంటర్వ్యూల జాబితాను కేవీఎస్‌(KVS) వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. నవంబర్‌ 3 నుంచి నవంబర్‌ 8 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూ కోసం ఎంపికైన అభ్యర్థుల వివరాలు, ఏయే తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారో పూర్తి వివరాలు కేవీఎస్‌ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. కటాఫ్‌ మార్క్‌లు, నార్మలైజేషన్‌ స్కోర్‌ తదితర వివరాలు వెల్లడించారు. ఇంటర్వ్యూ నిర్వహించనున్న వేదిక, తేదీలను అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. రిజర్వేషన్ల వారీగా కటాఫ్‌ మార్కులు పేర్కొన్నారు. రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ తదితర అంశాల్లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని