Apply Now: ఫ్యాషన్‌ ప్రపంచం వైపు వెళ్తారా? ఇదిగో గొప్ప ఛాన్స్‌!

ఫ్యాషన్‌ టెక్నాలజీ రంగం వైపు వెళ్లాలనుకొనేవారికి గుడ్‌న్యూస్‌. వచ్చే ఏడాది ప్రతిష్ఠాత్మక నిఫ్ట్‌ల్లో బ్యాచిలర్‌, మాస్టర్స్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు మొదలయ్యాయి.

Updated : 06 Dec 2023 20:25 IST

NIFT Admissions | ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆకర్షణీయంగా, ప్రత్యేకంగా ఉండటానికే ఇష్టపడుతున్నారు. ఫ్యాషన్‌ రంగంలో వస్తోన్న కొత్త ట్రెండ్స్‌ దిశగా వెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో ఫ్యాషన్‌ కోర్సులకు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా హైదరాబాద్‌తో పాటు 18 కేంద్రాల్లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(NIFT) క్యాంపస్‌ల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి NTA ఆన్‌లైన్‌లో https://exams.nta.ac.in/NIFT/ దరఖాస్తులు కోరుతోంది.

నోటిఫికేషన్‌లోని 10 ముఖ్యాంశాలివే..

  • నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైనింగ్‌, ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సుల్లో చేరేందుకు  10+2, తత్సమాన విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.  దీంట్లో ఆరు రకాల కోర్సులు (ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌, యాక్సెసరీ డిజైన్‌, ఫ్యాషన్‌ డిజైన్‌, నిట్‌వేర్‌ డిజైన్‌, లెదర్‌ డిజైన్‌, టెక్స్‌టైల్‌ డిజైన్‌) అందుబాటులో ఉన్నాయి.
  • అలాగే, రెండేళ్ల మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌లో చేరేందుకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. ఇందులో మాస్టర్స్‌ ఆఫ్‌ డిజైన్‌, మాస్టర్స్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌, మాస్టర్స్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సులను అందిస్తున్నారు. సృజనాత్మకత, డిజైన్‌పై ఆసక్తి, ఊహలకు రూపమివ్వగలిగే నైపుణ్యం, స్కెచింగ్‌ ప్రావీణ్యం ఉన్నవారు ఈ కోర్సుల్లో చేరి రాణించే అవకాశం ఉంటుంది. 
  • బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైనింగ్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సుల్లో చేరాలనుకొనే అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1 నాటికి 24 ఏళ్ల మించరాదు. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఐదేళ్ల పాటు వయో సడలింపు ఉంది. మాస్టర్స్‌ కోర్సులు, పీహెచ్‌డీ చేయాలనుకొనేవారికి మాత్రం ఎలాంటి వయో పరిమితి లేదు. 
  • ఆసక్తి కలిగిన వారు జనవరి 3వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైనింగ్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ రెండు కోర్సులకూ దరఖాస్తు రుసుం జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ(నాన్‌క్రిమిలేయర్‌) అభ్యర్థులు రూ.4500; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులైతే రూ.2500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
  • రూ.5000 ఆలస్య రుసుంతో జవనరి 4 నుంచి 8వరకు దరఖాస్తు చేసుకొనే వీలుంది. 
  • ఈ పరీక్షను ఫిబ్రవరి 5న దేశ వ్యాప్తంగా 60 నగరాల్లో నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరీక్షకు కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం; హైదరాబాద్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
  • దరఖాస్తు రుసుం: బ్యాచిలర్‌ కోర్సులకు జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ(నాన్‌క్రిమిలేయర్‌) అభ్యర్థులు రూ.3000; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులైతే రూ.1500 చొప్పున చెల్లించాలి.
  • పరీక్ష ఫలితాలు మార్చిలో వెలువడుతాయి.  పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు సిచ్యుయేషన్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూలను ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. 
  • ఎన్నారై/విదేశీయులకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు జనవరి 15 నుంచి ఏప్రిల్‌ 30 వరకు జరుగుతాయి. తుది ఫలితాలు ఏప్రిల్‌ ఆఖరి వారంలో ప్రకటించి.. మే-జూన్‌ మాసాల్లో సీట్లను కేటాయిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని