Apply Now: భారీ వేతనంతో తపాలా శాఖలో ఉద్యోగాలు.. దరఖాస్తులు షురూ!

తపాలా శాఖలో స్పోర్ట్స్‌ కోటాలో పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 9వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలివే..

Updated : 10 Nov 2023 17:09 IST

Postal Job Recruitment| ఇంటర్నెట్‌ డెస్క్‌:  తపాలా శాఖలో భారీ వేతనంతో పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో ఇంటర్‌, డిగ్రీ అర్హతతో స్పోర్ట్స్‌ కోటా కింద  1,899 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. పలు క్రీడాంశాల్లో ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన అభ్యర్థులు పోస్టల్‌ అసిస్టెంట్‌, సార్టింగ్‌ అసిస్టెంట్‌, పోస్ట్‌మ్యాన్‌, మెయిల్‌గార్డ్‌, మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌) ఉద్యోగాలకు శుక్రవారం (నవంబర్‌ 10) నుంచి డిసెంబర్‌ 9వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. 

దరఖాస్తు కోసం క్లిక్‌ చేయండి

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే.. 

  • మొత్తం ఉద్యోగాల్లో పోస్టల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 598 ఉండగా.. సార్టింగ్ అసిస్టెంట్‌ 143, పోస్ట్‌ మ్యాన్‌ 585, మెయిల్‌ గార్డ్‌ 3, మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌ (MTS) 570 చొప్పున ఉద్యోగాలు భర్తీ చేస్తారు. 
  • నవంబర్‌ 10 నుంచి డిసెంబర్‌ 9వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. డిసెంబర్‌ 10 నుంచి 14వ తేదీ వరకు దరఖాస్తుల్ని ఎడిట్‌ చేసుకొనే వెసులుబాటు కల్పిస్తారు.
  • దరఖాస్తు రుసుం జనరల్‌/ఓబీసీ అభ్యర్థులకు రూ.100 కాగా; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఈడబ్ల్యూఎస్‌/మహిళలు ఎలాంటి దరఖాస్తు రుసుం చెల్లించనవసరంలేదు.
  • తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఏపీలో 27 పోస్టల్‌ అసిస్టెంట్‌, 2 సార్టింగ్‌ అసిస్టెంట్‌, 15 పోస్ట్‌మ్యాన్‌, 17 ఎంటీఎస్‌ పోస్టులు భర్తీ చేయనుండగా.. తెలంగాణలో 16 పోస్టల్‌ అసిస్టెంట్‌, 5 సార్టింగ్ అసిస్టెంట్‌, 20 పోస్టుమ్యాన్‌, 2 మెయిల్‌గార్డు, 16 ఎంటీఎస్‌ ఉద్యోగాలు ఉన్నాయి.
  • వేతనం ఇలా..: పోస్టల్‌ అసిస్టెంట్‌, సార్టింగ్‌ అసిస్టెంట్‌ (లెవెల్‌ 4) ఉద్యోగాలకు వేతన శ్రేణి రూ.25,500 - రూ.81,100గా నిర్ణయించారు. అలాగే, పోస్టుమ్యాన్‌, మెయిల్‌గార్డు (లెవెల్‌ 3)  రూ. 21,700, - 69,100 చొప్పున; మల్టీటాస్కింగ్ సిబ్బంది (లెవెల్‌ 1) రూ.18000 నుంచి 59,900ల చొప్పున వేతనం చెల్లిస్తారు. 
  • వయో పరిమితి: పోస్టల్‌ అసిస్టెంట్‌, సార్టింగ్‌ అసిస్టెంట్‌, పోస్టుమ్యాన్‌, మెయిల్‌ గార్డు పోస్టులకు వయో పరిమితి 18 నుంచి 27ఏళ్లుగా నిర్ణయించగా.. ఎంటీఎస్‌ ఉద్యోగాలకు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలని పేర్కొన్నారు. ఆయా వర్గాలకు రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
  • అర్హతలు.. తపాలాశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొన్న క్రీడాంశాల్లో అర్హతతో పాటు పోస్టల్‌ అసిస్టెంట్‌/సార్టింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉండాలి.  కంప్యూటర్‌ పరిజ్ఞానం అవసరం. అలాగే,  పోస్టుమ్యాన్‌/మెయిల్‌గార్డు పోస్టులకు ఇంటర్‌ విద్యార్హతతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి. 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు