Teaching Jobs: ఆర్జీయూకేటీలో 220 లెక్చరర్‌ పోస్టులు.. వేతనం ఎంతంటే?

ఏపీలోని ఆర్జీయూకేటీలో 220 లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 20లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

Updated : 13 Nov 2023 17:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏపీలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT)లో లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ రెగ్యులర్‌ లెక్చరర్‌ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 20లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 220 అధ్యాపక పోస్టులకు గాను ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 20న సాయంత్రం 5గంటల లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెల్ఫ్‌ అటెస్టేషన్‌ చేయించిన డాక్యుమెంట్లను నవంబర్‌ 27లోపు నూజివీడులోని ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్‌కు సమర్పించాలి.

దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయండి

  • లెక్చరర్‌ పోస్టుల ఖాళీలివే.. బయాలజీ 8, కెమిస్ట్రీ 36, డ్యాన్స్‌ 4, ఇంగ్లిష్‌ 24, ఫైన్‌ఆర్ట్స్‌ 4, ఐటీ 28, లైబ్రరీ 8, మ్యాథమెటిక్స్‌ 32, మ్యూజిక్‌ 4, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ 12, ఫిజిక్స్‌ 36, సైకాలజీ 4, తెలుగు 16, యోగా 4 చొప్పున మొత్తం 220 లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను రిజర్వేషన్‌ ఆధారంగా భర్తీ చేస్తారు.
  • వేతన శ్రేణి: రూ.57,100 నుంచి గరిష్ఠంగా 1,47,760 వరకు పోస్టులను బట్టి నిర్ణయించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే.. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 
  • కంప్యూటర్‌ ఆధారిత స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఉంటుంది. 150 ప్రశ్నలు మల్టిపుల్‌ ఛాయిస్‌ రూపంలో ఉంటాయి. 180 నిమిషాల పాటు పరీక్ష ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు. తప్పు సమాధానానికి ఒక నెగెటివ్‌ మార్కు. 
  • రిజిస్ట్రేషన్‌ ఫీజు: అన్‌రిజర్వ్‌డ్‌/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ. 2500; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు రూ. 2000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్‌, తదితర అంశాల వారీగా స్క్రీనింగ్ పరీక్షకు అర్హుల్ని నిర్ణయించి వారి జాబితాను డిసెంబర్‌ 12 నాటికి విడుదల చేస్తారు.
  • స్క్రీనింగ్‌/రాత పరీక్షకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. హాల్‌టికెట్లు, ఫలితాల వెల్లడి, ఇంటర్వ్యూల తేదీలు తదితర వివరాలన్నీ తర్వాత ప్రకటిస్తారు. పోస్టుల వారీగా రిజర్వేషన్లు, విద్యార్హతల్లో మెరిట్‌తో పాటు పూర్తి వివరాలను ఈ కింది డాక్యుమెంట్‌లో చూడొచ్చు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు