APPLY NOW: భారీ వేతనంతో SBIలో 5వేలకు పైగా పోస్టులు.. త్వరగా అప్లై చేసుకోండి!

SBIలో 5వేలకు పైగా సీబీవో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువు తుది దశకు చేరింది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 17వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Updated : 15 Dec 2023 17:44 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. SBIకి చెందిన వివిధ సర్కిళ్లలో మొత్తం 5,447 (167 బ్యాక్‌లాగ్‌ ఖాళీలు) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(CBO) ఉద్యోగాల కోసం దరఖాస్తులకు తుది గడువు సమీపిస్తోంది. వాస్తవానికి దరఖాస్తుల గడువు డిసెంబర్‌ 12తోనే ముగిసినప్పటికీ దాన్ని డిసెంబర్‌ 17 వరకు పొడిగించారు. ఈ మొత్తం ఉద్యోగాల్లో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 800లకు పైగా కొలువులు ఉన్నాయి. ఆర్బీఐ లిస్టింగ్‌లో ఉన్న ఏదైనా బ్యాంకులో గరిష్ఠంగా రెండేళ్ల పాటు పనిచేసిన వారు అర్హులు. ఆసక్తికలిగిన అభ్యర్థులు డిసెంబర్‌ 17లోపు ఈ పోస్టులకు https://www.sbi.co.in/web/careers#lattest దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే.. 

  • విద్యార్హతలు: గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత. బ్యాంకింగ్‌ రంగంలో రెండేళ్ల పని చేసిన అనుభవం ఉండాలి.
  • వయో పరిమితి:  మార్చి 31, 2023 నాటికి 21 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. 
  • వేతనం: ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ₹36,000-₹ 63,840 వరకు వేతనం చెల్లిస్తారు.
  • ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తు ఫీజు: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు) 
  • ఆన్‌లైన్‌ పరీక్ష వచ్చే ఏడాది జనవరిలో జరిగే అవకాశం ఉంది.
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలివే.. గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని