Apply Now: ఎస్‌బీఐలో 6,160 అప్రెంటిస్ ఖాళీలు.. దరఖాస్తులు షురూ..

ఎస్‌బీఐలో భారీగా అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. సెప్టెంబర్‌ 1 నుంచి దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.

Published : 01 Sep 2023 14:30 IST

ఇంటర్నెట్ డెస్క్‌: డిగ్రీ పాసై బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వారికి గుడ్‌న్యూస్‌. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ (SBI)లో భారీగా అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 6,160 ఖాళీలను భర్తీ చేసేందుకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 1 నుంచి 21వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయండి

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే.. 

  • మొత్తం అప్రెంటిస్‌ ఖాళీలు 6160 ఉండగా.. కేటగిరీల వారీగా ఎస్సీ- 989, ఎస్టీ- 514, ఓబీసీ- 1389, ఈడబ్ల్యూఎస్‌- 603, యూఆర్‌- 2,665 చొప్పున ఉన్నాయి. వీటిలో ఏపీలో 390 ఖాళీలు ఉండగా.. తెలంగాణలో 125 ఉన్నాయి. 
  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. ఏడాది పాటు శిక్షణ ఉంటుంది.
  • ఈ ఏడాది కాలం పాటు నెలకు ₹15 వేల చొప్పున స్టైఫండ్‌ ఇస్తారు. ఇతర అలవెన్సులకు అర్హులు కాదు.
  • వయో పరిమితి: 2023 ఆగస్టు 1 నాటికి 20 నుంచి 28 ఏళ్లు మధ్య ఉండాలి. 
  • ఆన్‌లైన్‌ రాత పరీక్ష, స్థానిక భాష పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. 
  • ఆన్‌లైన్‌ రాత పరీక్ష అక్టోబర్‌/నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది.
  • దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని