Apply Now: SBIలో 2000 పీవో పోస్టులు.. దరఖాస్తులు షురూ

SBI PO Job Recruitment: ఎస్‌బీఐలో భారీగా పీవో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. గురువారం (సెప్టెంబర్‌ 7) నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.

Updated : 07 Sep 2023 12:04 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు State Bank of Indiaలో కొలువుల జాతర కొనసాగుతోంది. డిగ్రీ పాసై బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వారికి మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇటీవల 6,160 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చిన SBI.. తాజాగా మరో భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2000 ప్రొబేషనరీ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్టు తెలిపింది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 7 నుంచి 27వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు కోసం క్లిక్‌ చేయండి

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే.. 

  • మొత్తం ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులు 2000 ఉండగా..  కేటగిరీల వారీగా చూస్తే ఎస్సీ- 300, ఎస్టీ- 150, ఓబీసీ- 540, ఈడబ్ల్యూఎస్‌- 200, యూఆర్‌- 810 చొప్పున ఖాళీలు భర్తీ చేస్తారు.
  • వేతనం: ఉద్యోగాలకు ఎంపికైన వారికి బేసిక్ పే ₹41,960 (ఇతర సౌకర్యాలు అదనం)
  • వయో పరిమితి: ఏప్రిల్‌ 1, 2023 నాటికి 21 ఏళ్లు పూర్తయి ఉండాలి. అదే సమయంలో 30 ఏళ్లు దాటకూడదు.  ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (నాన్‌ క్రిమీలేయర్‌) మూడేళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ తదితరులకు ఐదేళ్లు చొప్పున వయో సడలింపు ఉంటుంది. 
  • ఎంపిక విధానం: బ్యాంకు పీవో ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో  చేపడతారు. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ పరీక్ష, సైకోమెట్రిక్‌ టెస్ట్‌, గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. 
  • మెయిన్‌ పరీక్ష ఎన్నిసార్లు రాయొచ్చు?: జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు నాలుగు సార్లు మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. జనరల్‌ (పీడబ్ల్యూబీడీ/ఈడబ్ల్యూఎస్‌ (పీడబ్ల్యూబీడీ) అభ్యర్థులు, ఓబీసీ, ఓబీసీ పిడబ్ల్యూబీడీ) అభ్యర్థులైతే ఏడు సార్లు రాసేందుకు ఛాన్స్‌ ఉంది. అదే ఎస్సీ/ఎస్సీ పీడబ్ల్యూబీడీ/ఎస్టీ/ఎస్టీపీడబ్ల్యూబీడీ) అభ్యర్థులకు ఎన్నిసార్లయినా రాయొచ్చు.
  • దరఖాస్తు ఫీజు: జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.750. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. 
  • సెప్టెంబర్‌ 7 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపు ఉంటుంది.
  • నవంబర్‌లో ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష; డిసెంబర్‌/జనవరిలో ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్ష; జనవరి/ఫిబ్రవరిలో సైకోమెట్రిక్‌, ఇంటర్వ్యూ, గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌ పరీక్షలు ఉంటాయి. ఫిబ్రవరి/మార్చిలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.
  • తెలుగు ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు:  చీరాల, చిత్తూరు ,ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌
  • మెయిన్స్‌ పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని