SBI PO Admit Cards: ఎస్‌బీఐ పీవో ప్రిలిమినరీ పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదల

SBI PO Prelims Admit Card 2023| ఎస్‌బీఐ ప్రిలిమినరీ పరీక్షకు అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయడం ద్వారా తమ అడ్మిట్‌ కార్డులు పొందొచ్చు.

Updated : 24 Oct 2023 14:42 IST

దిల్లీ: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI) బ్రాంచ్‌లలో 2వేల పీవో (ప్రొబేషనరీ ఆఫీసర్‌) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు నవంబర్‌ 1 నుంచి 6వరకు ప్రిలిమినరీ రాత పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో  SBI PO prelims పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ లింక్‌పై https://sbi.co.in/web/careers క్లిక్‌ చేసి తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయడం ద్వారా నవంబర్‌ 6వరకు అడ్మిట్‌ కార్డుల్ని పొందొచ్చు.

ఈ కొలువులకు ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ నగరాల్లో ప్రిలిమ్స్‌ పరీక్షకు సెంటర్లను ఏర్పాటు చేశారు. నవంబర్‌లో ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష అనంతరం డిసెంబర్‌/జనవరిలో ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్ష; జనవరి/ఫిబ్రవరిలో సైకోమెట్రిక్‌, ఇంటర్వ్యూ, గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌ పరీక్షలు ఉంటాయి. ఫిబ్రవరి/మార్చిలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని