Apply Now: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ పోస్టులు.. దరఖాస్తు చేశారా?

SBI Job Recrutiment: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు దరఖాస్తుల గడువు పొడిగించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్‌ 21వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

Published : 08 Oct 2023 15:24 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  బ్యాంకు శాఖల్లోని పలు విభాగాల్లో మొత్తం  స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌(SBI specialist cadre Officer) ఉద్యోగాలను రెగ్యులర్, కాంట్రాక్టు​ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తోంది. తొలుత సెప్టెంబర్‌ 15 నుంచి అక్టోబర్‌ 6వరకు దరఖాస్తులు స్వీకరించగా.. తాజాగా ఆ గడువును పొడిగించారు.  ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్‌ 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ పరీక్ష డిసెంబర్‌/ జనవరిలో జరిగే అవకాశం ఉంది. 

  • దరఖాస్తు రుసుం జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ₹750
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులైతే ఎలాంటి రుసుం చెల్లించనవసరం లేదు. 
  • అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుకు గరిష్ఠ వయోపరిమితి 32 ఏళ్లు; డిప్యూటీ మేనేజర్‌కు 35 ఏళ్లు, చీఫ్‌ మేనేజర్‌కు 42 ఏళ్లు, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌కు 45ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
  • అభ్యర్థులు ఏప్రిల్‌ 30, 2023 నాటికి బీఈ/బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌/కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌/సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌) లేదా ఎంసీఏ లేదా ఎం.టెక్‌/ఎమ్మెస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌/కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌/ఐటీ/ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ అర్హతతో పాటు గతంలో పనిచేసిన అనుభవం కూడా అవసరం.

దరఖాస్తు కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని