Results: 49,590 పోస్టులు.. ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్‌ (జీడీ) తుది ఫలితాలు వచ్చేశాయ్‌

SSC Constable (GD) final Results: సాయుధ పోలీస్‌ బలగాల్లో కానిస్టేబుల్‌ (జీడీ) పోస్టులకు సంబంధించి తుది ఫలితాలు వెల్లడయ్యాయి.

Updated : 20 Aug 2023 19:30 IST

(ఫైల్‌ ఫొటో)

దిల్లీ: కేంద్ర సాయుధ పోలీస్‌ బలగాల్లో (CAPF)  50,187 కానిస్టేబుల్(జీడీ) నియామకాలకు సంబంధించిన పరీక్షల తుది ఫలితాలు వచ్చేశాయి. మణిపుర్‌లో 597 ఖాళీలకు మినహా మిగతా 49,590 ఉద్యోగాలన్నింటికీ ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదలైంది. జులై 17 నుంచి ఆగస్టు 7 వరకు చేపట్టిన  ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం రిజర్వేషన్‌ అనుసరించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి తుది జాబితాను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) ఆదివారం ప్రకటించింది. వివిధ సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీకి గతేడాది నవంబర్‌లో నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. 

రాష్ట్రాలు, కేటగిరీల వారీగా కటాఫ్‌ మార్కుల జాబితా

దశల వారీగా మొత్తం 50,187 కానిస్టేబుల్(జనరల్‌ డ్యూటీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించగా.. పదో తరగతి విద్యార్హత కలిగిన లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎస్‌ఎస్‌సీ ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను నిర్వహించింది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మే 1 నుంచి 6వ తేదీ వరకు CRPF ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులను నిర్వహించింది. ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్‌ తదితర దశలను పూర్తి చేసి తాజాగా తుది ఫలితాలను ప్రకటించింది.

ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్‌ (జీడీ) పురుషుల తుది ఎంపిక జాబితా 

ఏయే విభాగంలో ఎన్నెన్ని పోస్టులు.. బీఎస్‌ఎఫ్‌లో 21,052, సీఐఎస్‌ఎఫ్‌లో 6060, సీఆర్‌పీఎఫ్‌లో 11169, ఎస్‌ఎస్‌బీలో 2274, ఐటీబీపీలో 1890+3752, ఏఆర్‌లో 3601, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో 214, ఎన్‌సీబీలో 175 చొప్పున మొత్తం 50,187 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్‌ (జీడీ) మహిళల తుది ఎంపిక జాబితా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని