SSC Recruitment: ఉద్యోగ నియామక పరీక్షలు-2024 క్యాలెండర్‌ విడుదల

వచ్చే ఏడాదిలో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షల క్యాలెండర్‌ను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(SSC) విడుదల చేసింది.

Updated : 07 Nov 2023 19:31 IST

SSC Recruitment Exams Calendar| దిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) పరీక్షల క్యాలెండర్‌ను ప్రకటించింది. వచ్చే ఏడాది (2024-25)లో నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల తేదీలతో ప్రత్యేక చార్ట్‌ను విడుదల చేసింది. దీంట్లో 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు నిర్వహించే గ్రేడ్‌-సి స్టెనోగ్రాఫర్‌, దిల్లీ పోలీస్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌, సీఏపీఎఫ్‌, జూనియర్‌ ఇంజినీర్‌, మల్టీ టాస్కింగ్‌ సిబ్బంది, హవల్దార్‌ (సీబీఐసీ& సీబీఎన్‌), కానిస్టేబుల్‌ (జీడీ) తదితర ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను ప్రకటించింది. ఆయా పోస్టులకు నోటిఫికేషన్‌, దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించే తేదీలను క్యాలెండర్‌లో పొందుపరిచింది. అప్పటి పరిస్థితులను బట్టి ఈ తేదీల్లో మార్పులు ఉండొచ్చు. పరీక్షల క్యాలెండర్‌ను ఈ కింది డాక్యుమెంట్‌లో చూడొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు