TGPSC Group 1 Prelims: గ్రూప్-1 ప్రిలిమ్స్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష కేంద్రం వద్ద వీటికి నో ఎంట్రీ!

తెలంగాణలో గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ రాసే లక్షలాది మంది అభ్యర్థులకు TGPSC కీలక సూచనలు చేసింది.

Published : 30 May 2024 00:13 IST

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌- 1 ప్రిలిమినరీ పరీక్ష రాసే అభ్యర్థులకు టీజీపీఎస్సీ (TGPSC) కీలక సూచనలు చేసింది. జూన్‌ 9న ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పరీక్ష జరుగుతుందని వెల్లడించింది. అభ్యర్థులను ఉదయం 9గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని తెలుపుతూ బుధవారం రాత్రి  ఓ ప్రకటన విడుదల చేసింది. పది గంటలకు పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తామని.. ఆ తర్వాత ఎవరినీ లోపలికి అనుమతించేది లేదని స్పష్టం చేసింది.

రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీ కోసం ప్రిలిమినరీ పరీక్షకు టీజీపీఎస్సీ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరీక్షకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించగా.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4.03 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే, TGPSC Group 1 Prelims పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు జూన్‌ 1న మధ్యాహ్నం 2గంటల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. అలాగే, పరీక్ష కేంద్రం వద్ద అభ్యర్థులు అనుసరించాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేసింది.

ఎక్కువ సేపు చదవలేకపోతున్నారా? ఈ చిట్కాలు ట్రై చేయండి!

  • కాలిక్యులేటర్లు, పేజర్లు, సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లెట్స్‌, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్‌ పరికరాలు, వాచ్‌, మ్యాథమెటిక్స్‌ టేబుళ్లు, లాగ్‌బుక్‌లు, లాగ్‌ టేబుళ్లు, వాలెట్స్‌, హ్యాండ్‌ బ్యాగ్‌లు, పౌచ్‌లు, రైటింగ్‌ ప్యాడ్‌, నోట్స్‌, ఛార్ట్స్‌, జ్యువెలరీ, ఇతర గ్యాడ్జెట్లు/ ఎలక్ట్రానిక్‌ పరికరాలు, రికార్డింగ్‌ పరికరాలకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిలేదు.
  • అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలి. షూ వేసుకోవద్దు. 
  • పరీక్ష సమయం పూర్తయ్యే వరకు పరీక్ష కేంద్రం నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతిలేదు. బయటకు వెళ్లే ముందు ఓఎంఆర్‌ షీట్‌ను ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. 
  • పరీక్ష కేంద్రం వద్ద బయో మెట్రిక్‌ ఉదయం 9.30గంటలకే మొదలవుతుంది. ఇన్విజిలేటర్‌ బయో మెట్రిక్‌ క్యాప్చర్‌ చేయకుండా అభ్యర్థుల పరీక్ష కేంద్రాన్ని వీడి వెళ్లొద్దు. ఒకవేళ ఎవరైనా తమ బయోమెట్రిక్‌లను ఇవ్వకపోతే.. వారి ఓఎంఆర్‌ జవాబు పత్రం మూల్యాంకనం చేయరు. 
  • బయో మెట్రిక్‌ రికార్డింగ్‌కు ఆటంకం కలిగించే విధంగా మెహెందీ, తాత్కాలిక టాటూలు వేసుకోవద్దు. 
  • అభ్యర్థుల విలువైన వస్తువులను భద్రపరుచుకొనేందుకు కమిషన్‌ పరీక్ష కేంద్రం వద్ద ఎలాంటి స్టోరేజీ సౌకర్యాన్ని ఏర్పాటు చేయదని గమనించాలి.
  • అభ్యర్థుల సౌలభ్యం కోసం సమయాన్ని అంచనా వేసేందుకు ప్రతి అరగంటకు హెచ్చరిక బెల్‌ మోగిస్తారు. అభ్యర్థులు హాల్‌లో ఇన్విజిలేటర్‌ నుంచి కూడా సమయం అడిగి తెలుసుకోవచ్చు. 
  • పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో ఆఖరి నిమిషంలో గందరగోళానికి గురవ్వకుండా  కనీసం ఒక్కరోజు ముందు వెళ్లి చెక్‌ చేసుకుంటే మంచిది. 
  • పరీక్షకు హాజరయ్యే ముందు అభ్యర్థులు హాల్‌టికెట్‌, ఓఎంఆర్‌ ఆన్షర్‌ షీట్‌లోని సూచనల్ని జాగ్రత్తగా చూడాలి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని