TS CPGET Results: సీపీగెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ కోసం క్లిక్ చేయండి

TS CPGET 2023 Results: వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తోన్న సీపీగెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌. ఈ కింద లింక్‌పై క్లిక్‌ చేసి ఫలితాలు పొందొచ్చు.

Updated : 22 Aug 2023 16:25 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని సంప్రదాయ విశ్వవిద్యాలయాలతో పాటు జేఎన్‌టీయూహెచ్‌లోని పీజీ సీట్ల భర్తీకి నిర్వహించిన కామన్‌ పీజీ ప్రవేశ పరీక్ష (CPGET)-2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, ఓయూ వీసీ డి.రవీందర్‌ విడుదల చేశారు. పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో 93.42% ఉత్తీర్ణత నమోదైనట్టు వెల్లడించారు. TS CPGET-2023 పరీక్షలు జూన్‌ 30 నుంచి జులై 10 వరరకు సీబీటీ ద్వారా నిర్వహించగా..60,443మంది విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

ఈ పరీక్షలో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ వర్సిటీ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంతో పాటు  జేఎన్‌టీయూ -హైదరాబాద్‌లో పీజీ, ఇంటిగ్రేటెడ్‌, పీజీ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని