Telangana SI Results: తెలంగాణ ఎస్సై తుది ఫలితాలు, అభ్యర్థుల జాబితా విడుదల

Telangana SI final Results released: తెలంగాణలో ఎస్సై తుది ఫలితాలు విడుదలయ్యాయి. 

Updated : 09 Aug 2023 15:51 IST

హైదరాబాద్‌: తెలంగాణలో వేలాది మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎస్సై, ఏఎస్‌ఐ పోస్టుల తుది ఎంపిక ఫలితాలు వచ్చేశాయ్‌. కీలకమైన కటాఫ్‌ మార్కుల ప్రక్రియను పూర్తి చేసిన తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి (TSLPRB) తాజాగా ఫలితాలను, ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. TSLPRB 2022 నోటిఫికేషన్‌కు సంబంధించి 554 ఎస్సై పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించగా దాదాపు 2.47 లక్షల మంది పరీక్ష రాశారు.

అభ్యర్థుల తుది జాబితా కోసం క్లిక్‌ చేయండి

గతేడాది ఆగస్టు 7న ప్రాథమిక రాతపరీక్షతో ఈ నియామక ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఫలితాల జాబితా వెలువరించడంతో ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల గుణగణాలు, ప్రవర్తన, క్రిమినల్‌ కేసులపై TSLPRB ఆరా తీయనుంది. గరిష్ఠంగా పది రోజుల్లోనే స్పెషల్‌ బ్రాంచ్‌ (ఎస్‌బీ) విభాగంతో విచారణ జరిపించిన అనంతరం అభ్యర్థులకు ఎంపిక లేఖలు పంపనుంది. దీన్నిబట్టి ఆగస్టు రెండోవారంలోగా అర్హుల జాబితాను పోలీసు, ఎక్సైజ్‌, ఫైర్‌, జైళ్లు.. ఇలా అన్ని విభాగాలకు పంపించనుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని