TSPSC: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 పరీక్ష నవంబర్‌కు వాయిదా

గ్రూప్‌-2 పరీక్ష వాయిదాపై ఎట్టకేలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 29, 30న జరగాల్సిన గ్రూప్-2 పరీక్ష నవంబర్‌కు వాయిదా పడింది.

Updated : 12 Aug 2023 22:47 IST

హైదరాబాద్‌: గ్రూప్‌-2 పరీక్ష వాయిదాపై ఎట్టకేలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 29, 30న జరగాల్సిన గ్రూప్-2 పరీక్ష నవంబర్‌కు వాయిదా పడింది. గ్రూప్‌-2 పరీక్ష రీ షెడ్యూల్‌ గురించి సీఎస్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చర్చించారు. టీఎస్‌పీఎస్సీతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఎస్‌కు సూచించారు. లక్షలాది మంది విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. 

భవిష్యత్‌లో విడుదల చేసే నోటిఫికేషన్ల విషయంలోనూ అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎస్‌కు సూచించారు. అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు తగిన సమయం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలమేరకు సీఎస్‌ శాంతికుమారి టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, కార్యదర్శితో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గ్రూప్‌-2 పరీక్షలను మూడు నెలలపాటు వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ నిరుద్యోగ అభ్యర్థులు గురువారం చేపట్టిన టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని