TSPSC Group 2 Exam: గ్రూప్‌-2 పరీక్ష మరోసారి వాయిదా

తెలంగాణలో గ్రూప్‌-2 (TSPSC Group 2) పరీక్ష మూడోసారి వాయిదా పడింది.  

Updated : 27 Dec 2023 22:49 IST

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌-2 (TSPSC Group 2) పరీక్ష మళ్లీ వాయిదా పడింది. జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు TSPSC బుధవారం రాత్రి ప్రకటించింది. పరీక్ష తేదీలను తర్వాత వెల్లడిస్తామని స్పష్టం చేసింది. మొత్తం 783 గ్రూప్‌- 2 పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

తొలుత విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం.. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్‌ -2 పరీక్ష జరగాల్సి ఉండగా.. అప్పుడు వరుసగా ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో గ్రూప్‌ -2 పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలతో వాయిదా పడ్డాయి. ఆ తర్వాత నవంబర్‌ 2, 3 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న వేళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో రెండోసారి వాయిదా వేశారు. తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించడం, TSPSC ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాల నేపథ్యంలో నెలకొన్న తాజా పరిస్థితులతో మరోసారి గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా పడ్డాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని