TSPSC - GROUP IV: గ్రూప్‌-4 ప్రాథమిక ‘కీ‘ విడుదల

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) నిర్వహించిన గ్రూప్‌-4 ప్రాథమిక ‘కీ’ (Group 4 Preliminary Key) విడుదలైంది.

Updated : 28 Aug 2023 20:39 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) నిర్వహించిన గ్రూప్‌-4 ప్రాథమిక ‘కీ’ (Group 4 Preliminary Key) విడుదలైంది. గ్రూప్‌-4 ప్రాథమిక ‘కీ’పై ఈ నెల 30 నుంచి సెప్టెంబర్‌ 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు కమిషన్‌ తెలిపింది. అలాగే పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్‌ షీట్ల డిజిటల్‌ కాపీలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. సెప్టెంబర్‌ 27 వరకు అవి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. తెలంగాణలో గ్రూప్‌-4 సర్వీసుల్లో వివిధ పోస్టుల నియామకానికి సంబంధించి రాత పరీక్ష (పేపర్‌-1, పేపర్‌-2) జులై 1న జరిగిన సంగతి తెలిసిందే. 

ప్రాథమిక ‘కీ’ కోసం క్లిక్‌ చేయండి..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని