TSPSC: గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్‌.. దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం

 గ్రూప్ - 3 దరఖాస్తుల్లో సవరణలకు TSPSC అవకాశం కల్పించింది. 

Updated : 14 Aug 2023 18:54 IST

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్ష దరఖాస్తుల్లో సవరణలకు TSPSC అవకాశం కల్పించింది. ఈ నెల 16న ఉదయం 10గంల నుంచి 21వ తేదీ సాయంత్రం 5 వరకు దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని తెలిపింది. తెలంగాణలో గ్రూప్‌-3 సర్వీసు(Group III services) ఉద్యోగాలకు గతేడాది డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ(TSPSC) నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

26 ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 1,363 పోస్టులు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. తెలంగాణ తొలి గ్రూప్‌-3 (Group-3) పరీక్షకు మొత్తం 5,36,477 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. గ్రూప్‌ 3 పరీక్షల షెడ్యూల్‌ను త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని