TSPSC: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో లెక్చరర్‌ పోస్టులు.. హాల్‌ టికెట్లు విడుదల

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో లెక్చరర్‌ పోస్టులకు సెప్టెంబరు 4 నుంచి 8 వరకు జరగనున్న కంప్యూటర్‌ ఆధారిత నియామక పరీక్షల హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ తెలిపారు.

Updated : 09 Sep 2023 12:13 IST

హైదరాబాద్‌: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో లెక్చరర్‌ పోస్టులకు సెప్టెంబరు 4 నుంచి 8 వరకు జరగనున్న కంప్యూటర్‌ ఆధారిత నియామక పరీక్షల హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12: 30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. వేర్వేరు సబ్జెక్టు పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు.. ప్రతి సబ్జెక్టు హాల్‌టికెట్‌ విడిగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని వెల్లడించారు.

వీరు సబ్జెక్టు పరీక్షతో పాటు ఆ రోజు జరిగే జనరల్‌ స్టడీస్‌ పరీక్ష తప్పనిసరిగా రాయాలని స్పష్టం చేశారు. ఉదాహరణకు ఒక అభ్యర్థి మెకానికల్‌, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ సబ్జెక్టులకు దరఖాస్తులు చేస్తే.. జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1 పరీక్ష తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. మాక్‌ టెస్ట్‌ల కోసం వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కమిషన్‌ వెల్లడించింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు