TTD Jobs: భారీ వేతనంతో తితిదేలో ఉద్యోగాలు.. అర్హతలివే..!

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పోస్టులకు అర్హులైన, ఆసక్తికలిగిన అభ్యర్థులు ఈ కింది లింక్‌ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

Updated : 27 Oct 2023 08:46 IST

తిరుపతి: తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో ఇంజినీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. శాశ్వత ప్రాతిపదికన ఏఈఈ, ఏఈ, ఏటీవో పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని హిందూ మతానికి చెందిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులుగా పేర్కొన్నారు. తగిన విద్యార్హతలతో పాటు ఆసక్తి వున్న అభ్యర్థులు నవంబర్ 23లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..

  • మొత్తం ఉద్యోగాలు (56): అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) 27 పోస్టులు ఉండగా..  అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) 10; అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్) 19 పోస్టులు చొప్పున మొత్తం 56 ఉద్యోగాలు ఉన్నాయి. 
  • అర్హత: బీఈ, బీటెక్‌ (సివిల్‌/ మెకానికల్‌), ఎల్‌సీఈ/ ఎల్‌ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. 
  • వయో పరిమితి: 42 ఏళ్లు మించరాదు.
  • ఎంపిక ప్రక్రియ: రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
  • వేతన శ్రేణి: నెలకు ఏఈఈకి రూ.57,100-1,47,760; ఏఈకి రూ.48,440-1,37,220; ఏటీవో పోస్టులకు రూ.37,640-1,15,500 వరకు వేతనం చెల్లిస్తారు.

దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని