UGC NET Results: యూజీసీ నెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌..

UGC NET Results: యూజీసీ నెట్‌ (జూన్‌) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయడం ద్వారా అభ్యర్థులు తమ ఫలితాలు పొందొచ్చు.

Published : 25 Jul 2023 17:55 IST

దిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (జూన్‌) 2023 (UGC- NET) పరీక్ష ఫలితాలు వచ్చేశాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో పాటు అక్కడ పేర్కొన్న సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్‌ చేసి ఫలితాలు పొందొచ్చు. జూన్‌ 13 నుంచి జూన్‌ 22వరకు ఆన్‌లైన్ విధానంలో యూజీసీ నెట్‌ పరీక్షను నిర్వహించి విషయం తెలిసిందే. మొత్తం 83 సబ్జెక్టులకు దేశవ్యాప్తంగా 181 నగరాల్లోని పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించగా.. 6,39,069 మంది అభ్యర్థులు హాజరయ్యారు. దేశంలోని యూనివర్సిటీల్లో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ పరీక్షను ఏటా రెండు సార్లు జాతీయ పరీక్షల ఏజెన్సీ ( NTA) నిర్వహిస్తోంది.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని