Exam Results: యూపీఎస్సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ-II పరీక్ష ఫలితాలు విడుదల

UPSC Results: సెప్టెంబర్‌ 3న యూపీఎస్సీ నిర్వహించిన ఎన్‌డీఏ, ఎన్‌ఏ-2 రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

Published : 26 Sep 2023 19:25 IST

దిల్లీ: యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(UPSC) నిర్వహించిన నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(NDA), నేవల్‌ అకాడమీ(NA)-II రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.  ఈ ఫలితాలను UPSC అధికార వెబ్‌సైట్‌ upsc.gov.inలో అందుబాటులో ఉంచారు. మొత్తం 395 ఖాళీలకు గాను  సెప్టెంబర్‌ 3న దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహించగా అధికారులు తాజాగా రాత పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. మార్కుల షీట్‌లను మరో 15 రోజుల్లో అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. రాత పరీక్ష పూర్తిచేసిన అభ్యర్థులు ఇండియన్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ వెబ్‌సైట్‌ Joinindianarmy.nic.in వెబ్‌సైట్‌లో రెండు వారాల లోగా రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు(SSB) ఇంటర్వ్యూల కోసం ఎంపిక కేంద్రాలు, తేదీలను అభ్యర్థుల ఈ-మెయిల్‌కు పంపించనున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. 

సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్న తపన, ఉన్నతోద్యోగాల్లో స్థిరపడాలనుకునే యువత కోసం యూపీఎస్సీ(UPSC) ఏటా రెండు సార్లు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(NDA), నేవల్‌ అకాడమీ(NA) పరీక్ష నిర్వహిస్తుంది. వచ్చే ఏడాది జులై 2 నుంచి ఎన్‌డీఏ 152వ కోర్సు, ఇండియన్‌ నేవల్‌ అకాడమీ 114వ కోర్సుల్లో ప్రవేశాలకు 17 మే 2023న యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జూన్‌ 6 వరకు అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరించారు. 3 సెప్టెంబర్‌ 2023న దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహించారు. మొత్తం  395 ఖాళీలు ఉండగా, వీటిలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ పోస్టులు 370 (ఆర్మీ-208, నేవీ-42, ఏయిర్‌ఫోర్స్- 120) కాగా.. 28 గ్రౌండ్ డ్యూటీకి సంబంధించినవి ఉన్నాయి.  నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్)లో 25 ఖాళీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, అనంతపురం, విజయవాడ, తిరుపతి, వరంగల్‌, హైదరాబాద్‌లలో రాతపరీక్షకు కేంద్రాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని