UPSC: ఈపీఎఫ్‌వోలో 577 పోస్టులకు రాత పరీక్ష ఫలితాలు విడుదల

ఈపీఎఫ్‌వోలో 577 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

Published : 21 Jul 2023 21:23 IST

దిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌(EPFO)లో 577 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అకౌంట్స్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి జులై 2న రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 577 పోస్టులు ఉండగా.. ఇందులో 418 ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్/ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు కాగా.. 159 అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఉద్యోగాలు ఉన్నాయి. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ రాత పరీక్ష ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


అసిస్టెంట్ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ రాత పరీక్ష ఫలితాలు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని