UPSC: నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, నేవల్‌ అకాడమీ అడ్మిట్‌ కార్డులు విడుదల

యూపీఎస్సీ నిర్వహించే నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, నేవల్‌ అకాడమీ పరీక్షకు సంబంధించి అడ్మిట్‌ కార్డులు విడుదల అయ్యాయి. అభ్యర్థులు సంబంధిత సమాచారంతో అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని యూపీఎస్సీ సూచించింది. 

Updated : 12 Aug 2023 01:14 IST

దిల్లీ: యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(UPSC) నిర్వహించే నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(NDA), నేవల్‌ అకాడమీ(NA) పరీక్ష(2)కు సంబంధించి అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసిన వారు యూపీఎస్సీ అధికార వెబ్‌సెట్‌ upsc.gov.in,  upsconline.nic.inలలో సంబంధిత సమాచారంతో అడ్మిట్‌ కార్డులను పొందవచ్చు. సెప్టెంబర్‌ 3 వరకు అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని యూపీఎస్సీ పేర్కొంది. పరీక్షకు హాజరుకానున్న విద్యార్థులు ప్రింట్‌ తీసుకున్న ఈ-అడ్మిట్‌ కార్డుతో పాటు, ఫొటోను చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ అడ్మిట్‌ కార్డుపై అభ్యర్థి ఫొటో సరిగా కనిపించకున్నా, మసకగా ఉన్న, ఒకవేళ ఫొటో లేకుండా ఉన్నా రెండు ఫొటోలను తీసుకురావాల్సి ఉంటుంది. అభ్యర్థికి సంబంధించిన సమాచారం అడ్మిట్‌కార్డుతో సరిపోలకుంటే వెంటనే usnda-upsc@nic.inకు ఈమెయిల్‌లో ఆగస్టు 23లోపు సంప్రదించాలని సూచించింది. 

సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే తపన, ఉన్నతోద్యోగాల్లో స్థిరపడాలనుకునే యువత కోసం యూపీఎస్సీ(UPSC) ఏటా రెండు సార్లు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(NDA), నేవల్‌ అకాడమీ(NA) పరీక్ష నిర్వహిస్తుంది. వచ్చే ఏడాది జులై 2 నుంచి ఎన్‌డీఏ 152వ కోర్సు, ఇండియన్‌ నేవల్‌ అకాడమీ 114వ కోర్సులో ప్రవేశం పొందేందుకు 17 మే 2023న ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జూన్‌ 6 వరకు అభ్యర్థుల దరఖాస్తులను తీసుకున్నారు. 3 సెప్టెంబర్‌ 2023న దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తంగా 395 ఖాళీలు ఉండగా, వీటిలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ పోస్టులు 370 (ఆర్మీ-208, నేవీ-42, ఏయిర్‌ఫోర్స్- 120) కాగా.. 28 గ్రౌండ్ డ్యూటీకి సంబంధించిన ఖాళీలు. నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) ఖాళీలు 25 ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని విశాఖ పట్నం, అనంతపురం, విజయవాడ, తిరుపతి, వరంగల్‌, హైదరాబాద్‌లలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని