క్యాన్సర్‌కూ మసాలా ఘాటు!

మాంసాన్ని కొందరు పెద్ద మంట మీద, నిప్పుల మీద కాల్చి, వేయించి తింటుంటారు...

Published : 19 Sep 2017 02:00 IST

క్యాన్సర్‌కూ మసాలా ఘాటు!

మాంసాన్ని కొందరు పెద్ద మంట మీద, నిప్పుల మీద కాల్చి, వేయించి తింటుంటారు. ఇలా అత్యధిక ఉష్ణోగ్రతలో మాంసాన్ని వండితే హెటెరోసైక్లిక్‌ అమైన్లు (హెచ్‌సీఏలు) అనే క్యాన్సర్‌ కారకాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి క్యాన్సర్‌కు దారితీయొచ్చు. అయితే కొన్ని మసాలా దినుసులతో దీన్ని నివారించుకోవచ్చని కన్సాస్‌ స్టేట్‌ విశ్వవిద్యాలయ అధ్యయనం పేర్కొంటోంది. సుమారు 100 గ్రాముల కీమాలో ఒక గ్రాము మిరియాల పొడి కలిపి వండినపుడు హెచ్‌సీఏల ఉత్పత్తి చాలావరకు తగ్గినట్టు తేలటమే దీనికి నిదర్శనం. మిరియాల పొడిలోని సహజ యాంటీఆక్సిడెంట్లు విశృంఖల కణాలకు అంటుకోవటమే దీనికి కారణం. అందువల్ల యాంటీఆక్సిడెంటు గుణాలు గల మిరియాలు, లవంగాల వంటి మసాలా దినుసులతో పాటు పుదీనా వంటివి మాసంతో కలిపి వండుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని