కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 05 Feb 2023 16:12 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


పొడుపు కథలు

1. ఆ ముగ్గురూ కవల పిల్లలు. ఎప్పుడూ వేలాడుతుంటారు.. కలిసే పనిచేస్తారు.. కలిసే విశ్రాంతి తీసుకుంటారు. ఎవరబ్బా?  
2. చచ్చిపోయినా.. కళ్లు తెరిచే ఉంటుంది. అదేంటో?
3. గోడకే ఉంటుంది కానీ రమ్మంటే రాదు.. ఎంత పొమ్మన్నా పోదు.. అన్నీ మనమే చూసుకోవాలి. ఏంటది?


నేను ఎవరబ్బా?

1. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘దానం’లో ఉంటాను కానీ ‘మౌనం’లో ఉండను. ‘నిరుడు’లో ఉంటాను కానీ ‘వరుడు’లో ఉండను. ‘అమ్మ’లో ఉంటాను. ‘కొమ్మ’లోనూ ఉంటాను. ఇంతకీ నేను ఎవరినో తెలిసిందా?
2. నేను రెండక్షరాల పదాన్ని. ‘పెనం’లో ఉన్నాను.. ‘వనం’లో లేను. ‘కన్ను’లో ఉన్నాను.. ‘జున్ను’లోనూ ఉన్నాను. నేనెవర్నో చెప్పగలరా?


తమాషా ప్రశ్నలు

1. ముక్కలు ముక్కలుగా చేసే కలం ఏది?
2. పచ్చగా కళకళలాడే రణం ఏంటి?
3. మంచిది కాని కారం ఏది?


చెప్పుకోండి చూద్దాం?

మీరు ఓ వ్యాన్‌ నడుపుతున్నారనుకోండి. మొదటి స్టాప్‌లో ముగ్గురు ఆడవాళ్లు దిగిపోయారు. రెండో స్టాప్‌లో నలుగురు పిల్లలు ఎక్కారు. మూడో స్టాప్‌లో అసలు వ్యాన్‌ ఆపలేదు. నాలుగో స్టాప్‌లో ఇద్దరు దిగారు. ముగ్గురు ఎక్కారు. అప్పుడే వాన చినుకులు మొదలయ్యాయి. అంతలోనే వర్షం జోరందుకుంది. ఇంతకీ వ్యాన్‌ డ్రైవర్‌ వయసు ఎంతో చెప్పగలరా?


నేను గీసిన చిత్రం


సమాధానాలు:

అక్షరాలతో ఆట : 1.పడవ 2.పిడక 3.కడవ 4.విడత 5.మడత 6.చిడత 7.నడత 8.మిడత

తమాషా ప్రశ్నలు : 1.కకావికలం 2.తోరణం 3.అపకారం/ప్రతీకారం

నేను ఎవరబ్బా? : 1.దానిమ్మ 2.పెన్ను

కవలలేవి? : 1, 3

పొడుపు కథలు : 1.ఫ్యాన్‌ 2.చేప 3.కిటికీ

పదమేంటి? : 1. FREEDOM 2. ELECTION

ఏ రెండు?: చిరుతపులి, ఎలుగుబంటి (ఈ రెండు జీవులకూ చెట్లు ఎక్కే సామర్థ్యం ఉంది.)

చెప్పుకోండి చూద్దాం?: మీ వయసు ఎంతో వ్యాన్‌ డ్రైవర్‌ వయసూ అంతే! ఎందుకంటే ఆ వ్యాన్‌ నడుపుతోంది మీరే కదా!Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని