నాతో ఆడుకోవద్దు..!

హాయ్‌ పిల్లలూ..! నేను మీకు బాగా పరిచయమున్న సెల్‌ఫోన్‌ని. మొత్తానికి పరీక్షలన్నీ బాగా రాశారు కదా! ఇక ఎంచక్కా నాతో పాటు ఆడుకోవచ్చు అనుకుంటున్నారా? అదే వద్దని చెబుదామనే ఇలా వచ్చాను

Published : 24 Apr 2024 01:48 IST

హాయ్‌ పిల్లలూ..! నేను మీకు బాగా పరిచయమున్న సెల్‌ఫోన్‌ని. మొత్తానికి పరీక్షలన్నీ బాగా రాశారు కదా! ఇక ఎంచక్కా నాతో పాటు ఆడుకోవచ్చు అనుకుంటున్నారా? అదే వద్దని చెబుదామనే ఇలా వచ్చాను. సెలవులు వచ్చాయి కదా అని, నాతో ఎక్కువ సమయం గడపకండి పిల్లలూ.. అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. నాకూ కాస్త విశ్రాంతినివ్వండి. అలాగని ఎండలోకెళ్లి కూడా ఆడకండి. అమ్మానాన్నలు, తాతయ్య, నానమ్మలతో కలిసి ఇంట్లోనే ఆడుకోండి. సాయంత్రం వేళ కాసేపు బయటికి వెళ్లి.. స్నేహితులతో గడపండి. పుస్తకాలు చదవడం, ఆసక్తి ఉంటే.. ఆటలు, పాటలు వంటివి నేర్చుకోండి. ఉంటా నేస్తాలూ.. బై!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని